Asianet News TeluguAsianet News Telugu

చెత్త బ్యాటింగ్ తో కోల్ కతా ఇంటికి: హైదరాబాద్ కు కలిసొచ్చిన అదృష్టం

ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే అనివార్యంగా విజయం సాధించాల్సిన మ్యాచులో అత్యంత పేలవమైన బ్యాటింగ్ చేసింది. కట్టుదిట్టమైన ముంబై ఇండియన్స్ బౌలింగుతో కోల్ కతా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. దీంతో మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాదు ప్లే ఆఫ్ లో బెర్త్ దక్కించుకుంది.

With Kolkata defeat Hyderabad Sun Risers in play off
Author
Mumbai, First Published May 6, 2019, 10:17 AM IST

ముంబై: ముంబై ఇండియన్స్ పై కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు కలిసి వచ్చింది. ఆదివారం జరిగిన మ్యాచులో అత్యంత చెత్త బ్యాటింగ్ తో కోల్ కతా నైట్ రైడర్స్ ఓటమి పాలై ఇంటి ముఖం పట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో, అంటే 120 బంతుల్లో కోల్ కతా అందులో సగం, అంటే అరవై బంతుల్లో పరుగులే తీయలేదు.

ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే అనివార్యంగా విజయం సాధించాల్సిన మ్యాచులో అత్యంత పేలవమైన బ్యాటింగ్ చేసింది. కట్టుదిట్టమైన ముంబై ఇండియన్స్ బౌలింగుతో కోల్ కతా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. దీంతో మెరుగైన రన్ రేట్ కారణంగా హైదరాబాదు ప్లే ఆఫ్ లో బెర్త్ దక్కించుకుంది.

9 విజయాలు సాధించి 18 పాయింట్లతో టాప్‌–3 జట్లు సమానంగా ఉన్నప్పటికీ తాజా విజయం తర్వాత రోహిత్‌ సేన రన్‌రేట్‌ కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. పాయింట్ల పట్టికలో తర్వాతి మూడు టీమ్‌లు సమంగా నిలిచినా మెరుగైన రన్‌రేట్‌లో హైదరాబాదు ముందుకు దూసుకుపోయింది. ఐపీఎల్‌ చరిత్రలో 12 పాయింట్లు మాత్రమే సాధించిన టీమ్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. 

ఆదివారం జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్‌ తొమ్మిది వికెట్ల తేడాతో కోల్‌కతాపై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేయగలిగింది. క్రిస్‌ లిన్‌ (29 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 41 పరుగులు) ధాటిగా ఆడాడు. రాబిన్‌ ఉతప్ప (47 బంతుల్లో 3 సిక్స్ ల సాయంతో 40 పరుగులు) చేశాడు.  ముంబై ఇండియన్స్ బౌలర్లలో మలింగ 3 వికెట్ల తీయగా, హార్దిక్‌ పాండ్యా, బుమ్రా చెరో 2 వికెట్లు పడగొట్టారు. 

ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన ముంబై 16.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 134 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (48 బంతుల్లో 55 నాటౌట్‌; 8 ఫోర్లు), సూర్య కుమార్‌ (27 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్‌కు అభేద్యంగా 60 బంతుల్లోనే 88 పరుగులు జోడించి విజయాన్ని ఖాయం చేశారు.

ఓపెనర్‌ లిన్‌ ఆరంభంలో చూపించిన దూకుడు మినహా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌ మొత్తం పేలవంగా సాగింది. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి స్కోరు 49 పరుగులకు చేరింది. ఈ దశలో హార్దిక్‌ పాండ్యా ... వరుస ఓవర్లలో గిల్, లిన్‌లను ఔట్‌ చేసి కోల్‌కతాను దెబ్బ తీశాడు. అంతే... ఆ తర్వాతి నుంచి కోల్‌కతా కష్టాలు మొదలయ్యాయి. 7–12 మధ్య ఆరు ఓవర్లలో నైట్‌రైడర్స్‌ 16 పరుగులు మాత్రమే చేయగలిగిందంటే పరిస్థితి అర్థమవుతుంది! మలింగ వేసిన 13వ ఓవర్లో కోల్‌కతాకు పెద్ద దెబ్బ పడింది.

సిక్సర్‌తో ఖాతా తెరిచిన  డి కాక్‌ దూకుడు కొనసాగించి జట్టుకు కావాల్సిన శుభారంభాన్ని అందించాడు. డి కాక్‌ ఔటయ్యాక... రోహిత్, సూర్యకుమార్‌ సునాయాసంగా పరుగులు సాధించి జట్టును గెలుపు దిశగా నడిపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios