Asianet News TeluguAsianet News Telugu

విల్ జాక్స్ సూప‌ర్ సెంచ‌రీ.. కోహ్లీ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్.. గుజ‌రాత్ పై బెంగ‌ళూరు గెలుపు

RCB vs GT : విల్ జాక్స్ సూప‌ర్ సెంచరీ, విరాట్ కోహ్లీ అద్భుత హాఫ్ సెంచరీతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 9 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై ఘన విజయం సాధించింది.

Will Jacks super century, Virat Kohli another half century innings.. Bengaluru win over Gujarat, RCB vs GT IPL 2024 RMA
Author
First Published Apr 28, 2024, 7:50 PM IST

Royal Challengers Bangalore vs Gujarat Titans : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో మ‌రో భారీ స్కోర్ మ్యాచ్ జ‌రింది. 400+ ప‌రుగులు వ‌చ్చాయి. గుజ‌రాత్ సాధించిన‌ భారీ స్కోర్ ను తుఫాను ఇన్నింగ్స్ తో ఆర్సీబీ టార్గెట్ ను ఛేధించింది. ఐపీఎల్ 2024 ఎడిష‌న్ లో 45వ మ్యాచ్‌లో, గుజరాత్ టైటాన్స్-రాయల్ ఛాలెంజ్ బెంగళూరు జట్లు ఒకదానితో ఒకటి తలపడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. విల్ జాక్స్ సూప‌ర్ సెంచ‌రీ, విరాట్ కోహ్లీ అద్భుత‌మైన హాఫ్ సెంచ‌రీతో 16 ఓవ‌ర్ల‌లోనే ఆర్సీబీ విజ‌యం అందుకుంది.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. 201 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఆర్సీబీ ఆట‌గాళ్లు  విల్ జాక్వెస్ (100 పరుగులు*) తుఫాను సెంచరీతో రాణించగా, విరాట్ కోహ్లి (70 పరుగులు*) అజేయ అర్ధ సెంచరీతో మ‌రో 24 బంతులు మిగిలి ఉండ‌గానే ఆర్సీబీని విజయతీరాలకు చేర్చారు. 

సారా టెండూల్కర్ తో బ్రేకప్? శుభ్‌మన్ గిల్ కొత్త గర్ల్ ఫ్రెండ్?

దుమ్మురేపిన విల్ జాక్స్, విరాట్ కోహ్లీ.. 

గుజరాత్ నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీకి ఆదిలోనే తొలి దెబ్బ తగిలింది. 24 పరుగుల వద్ద కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ అవుటయ్యాడు. దీని తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన విల్ జాక్స్.. కోహ్లీతో కలిసి సూప‌ర్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్ర‌మంలోనే కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కోహ్లి అర్ధ సెంచరీ పూర్తి చేసిన తర్వాత, విల్ జాక్స్ గుజ‌రాత్ బౌల‌ర్ల‌పై విరుచుకుప‌డుతూ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీని త‌ర్వాత మ‌రింత‌గా రెచ్చిపోతూ వ‌రుస  బౌండ‌రీల‌తో అద‌ర‌గొట్టాడు. సెంచ‌రీ పూర్తి చేసుకుని ఆర్సీబీకి విజ‌యాన్ని అందించాడు. విల్ జాక్స్ 41 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో అజేయంగా 100 పరుగులు సాధించాడు. కోహ్లి 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది మూడో విజయం.

 

 

సాయి సుద‌ర్శ‌న్, షారుక్ ఖాన్ హాఫ్ సెంచ‌రీలు.. 

సాయి సుదర్శన్ అజేయ అర్ధ సెంచరీ, షారుక్ ఖాన్ ధ‌నాధ‌న్ అర్ధ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (5 పరుగులు), శుభ్ మన్ గిల్ (16 పరుగులు) ఫ్లాప్ షో తో పెవిలియ‌న్ కు చేరారు. తర్వాత క్రీజులోకి వ‌చ్చిన‌ షారుఖ్ ఖాన్, సాయి సుదర్శన్ ఆర్సీబీ బౌలర్ల పై విరుచుకుప‌డ్డారుఉ. ఇద్ద‌రు అర్ధ సెంచరీలు సాధించారు. అయితే 58 పరుగుల వద్ద షారుక్ ఔటయ్యాడు. త‌న ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. మ‌రో ఎండ్ లో సుదర్శన్ 49 బంతుల్లో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. చివరి ఓవర్లలో డేవిడ్ మిల్లర్ కూడా 2 ఫోర్లు, 1 సిక్సర్ బాది 26 పరుగులు సాధించాడు. 

 

 

ఇరు జ‌ట్ల ప్లేయింగ్-11

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.

గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుభమాన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.

17 ఏళ్ల వయస్సులో అంజలి ప్రేమలో.. మారువేషంలో డేట్.. సచిన్ టెండూల్కర్ 'లవ్ స్టోరీ'..

Follow Us:
Download App:
  • android
  • ios