Asianet News TeluguAsianet News Telugu

ఫ్యామిలీలో పది మందికి కరోనా: క్రికెటర్ అశ్విన్ భార్య ప్రీతి స్పందన ఇదీ..

తన కుటుంబంలో పది మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన స్థితిలో తమ కష్టాలను క్రికెటర్ అశ్విన్ బార్య ప్రీతి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. మాస్క్ ధరించాలని ఆమె సూచించారు.

Wife of Ravichandran Ashwin Prithi shares ordeal of the family with Covid
Author
Chennai, First Published May 1, 2021, 8:25 AM IST

చెన్నై: ఐపిఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కుటుంబంలో పది మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన స్థితిని చవి చూసింది. ఆ సమయంలో తాము తీసుుకున్న చర్యలను అశ్విన్ సతీమణి ప్రీతి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కోవిడ్ నుంచి తన కుటుంబ సభ్యులను కాపాడుకోవడానికి అశ్విన్ ఐపిఎల్ నుంచి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. 

తన కటుంబంలోని ఆరుగురు పెద్దలకు, నలుగురు పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చిందని, పిల్లల ద్వారా ఇతరులకు సంక్రమించే పరిస్థితి ఎదురైందని ఆమె చెప్పారు. కరోనా పాజిటివ్ వచ్చిన తన కుటుంబ సభ్యులు వివిధ నగరాల్లో, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆమె చెప్పారు. 

వైరస్ వ్యాపిస్తున్న స్థితిలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని, కరోనాపై పోరాటానికి అదే ఉత్తమ మార్గమని ఆమె అన్నారు. మానసిక అనారోగ్యం కన్నా శారీరక అనారోగ్యం త్వరగా నయమవుతుందని ఆమె అన్నారు. మాస్క్ ధరించాలని ఆమె సూచించారు. వ్యాక్సిన్ తీసుకుని, మాస్కులు ధరించి మీ కుటుంబ సభ్యులకు కరోనాపై పోరాడే సత్తాను ఇవ్వాలని ఆమె సూచించారు.

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. అశ్విన్ ఢిల్లీ క్యాపిటల్ సహచర ఆటగాళ్లు అక్షర్ పటేల్, రాయల్ చాలెంర్స్ బెంగళూరు ఆటగాడు దేవదత్ పడిక్కల్, మాజీ టీమిండియా ఆటగాడు సచిన్ టెండూల్కర్ కరోనా వైరస్ తో బాధపడ్డారు. 

ఐపిఎల్ 2021లో అశ్విన్ ఐదు మ్యాచులు ఆడాడు. ఒక్క వికెట్ మాత్రమే తీసుకున్నాడు. అతను 2011లో ప్రీతిని వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios