FIFA: తొలి గోల్ కొట్టిన వీరుడెవరు..? ఇప్పటివరకూ ఎన్ని గోల్స్ నమోదయ్యాయో తెలుసా..

FIFA World Cup 2022: నేటి నుంచి ఖతర్ వేదికగా  ఫుట్‌బాల్  ప్రపంచకప్ మొదలుకాబోతున్నది.  ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్ 22వది.  ఈ నేపథ్యంలో తొలి గోల్ కొట్టిందెవరు..?  ఎన్ని గోల్స్ నమోదయ్యాయో ఇక్కడ చూద్దాం.  

Who Scored First Goal in FIFA World Cu[p History? check Here

నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకూ  ఖతర్ వేదికగా ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ జరుగనుంది. నేటి సాయంత్రం  5 గంటలకు ప్రారంభ వేడుకలతో  ఈ టోర్నీ అధికారికంగా ప్రారంభం కానుంది. అయితే మరికొద్దిరోజుల పాటు ఫుట్‌బాల్ అభిమానులకు గోల్స్ పండుగ  జరుగనుంది.  దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారులంతా తమ కిక్ లతో అభిమానులకు ‘కిక్కు’ ఇవ్వనున్నారు.  ఈ నేపథ్యంలో  అసలు  ప్రపంచకప్ తొలిసారిగా ఎప్పుడు  జరిగింది..?  తొలి గోల్ కొట్టిందెవరు..?  ఇప్పటివరకు నమోదైన గోల్స్ ఎన్ని..? వంటి  ఆసక్తికర విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. 

ప్రపంచకప్ మొట్టమొదటిసారిగా  1930లో జరిగింది.   మొత్తంగా  13 దేశాలు ఇందులో పాల్గొన్నాయి.  ప్రపంచకప్ లో మొట్టమొదటి మ్యాచ్  ఫ్రాన్స్ - యూనైటెడ్ స్టేట్స్ (మెక్సికో) నడుమ జరిగింది.  ఈ మ్యాచ్ లో తొలి గోల్ కొట్టింది  ఫ్రాన్స్ కు చెందిన లూసిన్ లారెంట్.  1930 జులై  13న  లారెంట్..   

ఐదు ఫీట్ల  3 ఇంచులుండే  లూసిన్ ..  ఈ  మ్యాచ్ లో తన ఆటతో ఫ్రాన్స్  గెలుపులో కీలక పాత్ర పోషించాడు.  ఈ మ్యాచ్ లో ఫ్రాన్స్ 4-1 తేడాతో మెక్సికోను ఓడించింది. తన ఫస్ట్ గోల్ పై  ఓ సందర్భంలో లూసిన్ మాట్లాడుతూ.. ‘నేను ప్రపంచకప్ లో తొలి గోల్ కొట్టినప్పుడు మేమందరం అభినందించుకున్నాం.  కానీ ఇప్పటిలాగా  ఒకరి మీద ఒకరం పడి దొర్లలేదు..’ అని వ్యాఖ్యానించాడు.  

 

ప్రఖ్యాత గోల్స్..  ఆటగాళ్ల పేర్లు : 

- వందో గోల్ : ఇటలీకి చెందిన  ఏంజెలో షియవియో  (1934 లో జరిగిన రెండో ప్రపంచకప్ లో) 
- 500వ గోల్  :  స్కాట్లాండ్  ప్లేయర్  రాబర్ట్ యంగ్ కొలిన్స్ (1958లో ఫిఫా  వరల్డ్ కప్ లో   పెరుగ్వే మీద ఈ రికార్డు నెలకొల్పాడు) 
- 1000వ గోల్ :  నెదర్లాండ్స్  ఫుట్బాలర్  రాబ్ రిన్సెన్బ్రిక్  (1978  వరల్డ్ కప్ లో  అర్జెంటీనాతో మ్యాచ్ లో  ఫిఫా ప్రపంచకప్ లో వెయ్యో గోల్ కొట్టాడు.  
- 1,500వ గోల్ : అర్జెంటీనాకు చెందిన క్లాడియో కనిగియ   1994 వరల్డ్ కప్ లో నైజీరియాతో మ్యాచ్ లో  1,500వ గోల్ కొట్టకాడు. 
- 2000వ గోల్ :  స్వీడన్ ఫుట్బాలర్ మార్కస్  అల్బ్యాక్  2006  వరల్డ్ కప్ లో   ఇంగ్లాండ్ తో  జరిగిన మ్యాచ్ లో గోల్ కొట్టడం ద్వారా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
- 2,500వ గోల్ :   ట్యూనీషియా ఆటగాడు  ఫక్రేద్దైన్  బెన్ యోసెఫ్   2018 వరల్డ్ కప్  లో  ఈ ఘనత సాధించాడు.  పనామాతో జరిగిన మ్యాచ్ లో  యోసెఫ్ గోల్ కొట్టడం ద్వారా 2,500 వ గోల్ సాధించాడు.

2018లో రష్యా వేదికగా ముగిసిన  ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ క్రొయేషియా-ఫ్రాన్స్ మధ్య ముగిసింది. ఈ మ్యాచ్ లో   క్రొయేషియాకు చెందిన   మారియో మంజుగిక్  చేసిన గోల్ ప్రపంచకప్ లో చివరి గోల్ అయింది.ఇది  2,548వ గోల్. ఇక నేటి నుంచి జరుగబోయే ఫిఫా ప్రపంచకప్ తో ఈ  నెంబర్ మళ్లీ మొదలుకానుంది.  దాదాపు నెల రోజుల పాటు  32 దేశాలు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో ఆటగాళ్లు గోల్స్ సంఖ్యను 3వేలకు చేర్చుతారో లేదో  చూడాలి మరి..   

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios