టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎంటీవీ వీజే అనూష దండేకర్‌ ... బాగా యంగ్‌గా వున్న కోహ్లిని ఇంటర్వ్యూ చేసిన వీడియో ఇది. దీనిలో అనూష ర్యాపిడ్‌ ఫైర్‌ ఫార్మాట్‌లో కోహ్లిని కొన్ని ప్రశ్నలు అడిగింది.

దీనిలో భాగంగా ‘‘మీ జీవితంలో త్వరగా ముగిసిన భోజనం, స్నానం, డేట్‌’’ గురించి చెప్పాలని అడిగింది. దీనికి సమాధానమిచ్చిన కోహ్లి... తాను ఒకమ్మాయితో బ్లైండ్‌ డేట్‌కి వెళ్లానని చెప్పారు. అయితే ఆమె అందంగా లేకపోవడంతో కేవలం ఐదు నిమిషాల్లో అ‍క్కడి నుంచి పారిపోయాను అని చెప్పడంతో యాంకర్ ఖంగుతింది.

Also Read:మరో విరాట్ కోహ్లీ అవుతాడని భావించిన ఉన్ముక్త్ చంద్... ఏమయ్యాడు, ఎటు పోయాడు...

ఇక ఇదే ఇంటర్వ్యూలో కోహ్లి బాలీవుడ్‌ హీరోయిన్‌ల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తన భార్య అనుష్క శర్మ గురించి కాదు. ఏ హీరోయిన్‌ క్రికెట్‌ ఆడాలనుకుంటే మీరు చూడాలనుకుంటున్నారు అనే ప్రశ్నకు జెనిలియా అని సమాధానం చెప్పాడు కోహ్లీ.

ప్రస్తుతం ఈ వీడియో మరోసారి వైరలవుతోంది. కాగా, బాలీవుడ్ అగ్రకథానాయక అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. అనంతరం వీరిద్దరూ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం విరుష్క దంపతులకు ఓ పాప.