కేఎల్ రాహుల్ కి చివరి నిమిషంలో చెప్పా.. రోహిత్ శర్మ
బదులుగా పాకిస్తాన్ 128 పరుగులకేు పరిమితమైంది. దీంతో, భారత్ 228 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ, కేఎల్ రాహుల్ చెలరేగిపోయి ఆడారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఉంటాడు అనే విషయం అందరికీ తెలుసు
టీమిండియా ఆసియాకప్ 2023లో అదరగొడుతోంది. సోమవారం పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు అదరగొట్టారు. దీంతో, విజయం భారత్ ని వరించింది. టాస్ ఓడిపోయి టీమిండియా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే, 50 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి 356 పరుగులు చరేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ హాఫ్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత స్టేడియంలోకి అడుగుపెట్టిన కోహ్లీ, కే ఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు.
లక్ష్య చేధన చేయడానికి అడుగుపెట్టిన పాకిస్తాన్ ఘోర ఓటమిని చవి చూసింది. వికెట్లు కాపాడుకోవడంలో విఫలమైంది. బదులుగా పాకిస్తాన్ 128 పరుగులకేు పరిమితమైంది. దీంతో, భారత్ 228 రన్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ, కేఎల్ రాహుల్ చెలరేగిపోయి ఆడారు. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఉంటాడు అనే విషయం అందరికీ తెలుసు. కానీ, కేఎల్ రాహుల్ ని మాత్రం చివరి నిమిషంలో జట్టులోకి తీసుకున్నారు.
ఈ విషయాన్ని రోహిత్ శర్మ వివరించారు. కేవలం టాస్ వేయడానికి ఐదు నిమిషాల ముందు మాత్రమే ఈ మ్యాచ్ ఆడుతున్నామని కేఎల్ రాహుల్ కి చెప్పారట. గాయం నుంచి కోలుుకున్న తర్వాత ఇంత సూపర్ ఇన్నింగ్స్ చేయడం అంత సులువేం కాదని, కానీ, రాహుల్ అదరగొట్టాడు అని రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కేవలం ఐదు నిమిషాల ముందు చెప్పినా, ఇంత బాగా ఆడాడు అని రాహుల్ పై ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఐపీఎల్ 2023లో గాయపడి మధ్యలోనే లీగ్ నుంచి వైదొలిగిన కేఎల్ రాహుల్.. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. 106 బంతుల్లో 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రాహుల్.. తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.