Asianet News TeluguAsianet News Telugu

కేఎల్ రాహుల్- కెప్టెన్సీ, ప్లేయర్ రిటెన్షన్‌ల లక్నో టీమ్ యజమాని వ్యాఖ్య‌లు దేనికి సంకేతం?

IPL 2025 - lsg : ఐపీఎల్ 2025 కోసం లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) లెజెండ‌రీ బౌల‌ర్ జహీర్ ఖాన్ ను మెంటర్ గా రంగంలోకి దింపింది. క్రమంలోనే లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకా రాబోయే సీజన్‌కు ముందు కేఎల్ రాహుల్- కెప్టెన్సీ, ప్లేయర్ రిటెన్షన్‌ల గురించి ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్స్ చేశారు. 
 

What is the sign of the Lucknow team owner's comments on KL Rahul's captaincy and player retentions?  IPL 2025 RMA
Author
First Published Aug 28, 2024, 5:37 PM IST | Last Updated Aug 28, 2024, 5:37 PM IST

IPL 2025 - Lucknow Supergiants : ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు భారత దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్‌ను మెంటార్‌గా నియమించినట్లు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) బుధవారం ప్రకటించింది. కోల్ క‌తాలో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ల‌క్నో టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా మాట్లాడుతూ.. జహీర్ ఖాన్ తో రాబోయే ఐపీఎల్ ఎడిష‌న్ ప్ర‌యాణం, కేఎల్ రాహుల్ భవిష్యత్తుతో సహా జట్టు ప్రణాళికలపై తన ఆలోచనలను పంచుకున్నారు. ప్రస్తుతం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

ఫ్రాంచైజీని బ్యాక్-టు-బ్యాక్ ప్లేఆఫ్‌లకు న‌డిపించిన నాయ‌కుడు కేఎల్ రాహుల్. 2024 ఎడిష‌న్ లో అత‌నితో పాటు జ‌ట్టుపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కానీ, వాటిని అందుకోవ‌డంలో జ‌ట్టు విఫ‌ల‌మైంది. ఐపీఎల్ 2024లో జట్టు మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న లేక‌పోవ‌డంతో 7వ స్థానంలో స‌రిపెట్టుకుంది. దీంతో కేఎల్ రాహుల్ టార్గెట్ గా మారాడు. ఆ జ‌ట్టు య‌జ‌మాని సంజీవ్ గోయెంకా.. కేఎల్ రాహుల్ తో గ్రౌండ్ లో న‌డుచుకున్న తీరు క్రికెట్ వ‌ర్గాల్లో తీవ్ర వివాదం రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో రాబోయే సీజ‌న్ లో కేఎల్ రాహుల్ ను ల‌క్నో టీమ్ తో క‌లిసి చూడ‌టం క‌ష్ట‌మే అనే చ‌ర్చ సాగింది. ఇప్ప‌టికీ దీనిపై ఉత్కంఠ కొన‌సాగుతూనే ఉంది. తాజాగా సంజీవ్ గోయెంకా ల‌క్నో టీమ్ మార్పుల గురించి ప్ర‌స్తావించారు. 

గత నెలలో బీసీసీఐ ఐపీఎల్ మెగా వేలం, ప్లేయర్ల‌ రిటెన్షన్స్, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనలపై చ‌ర్చించ‌డానికి ఫ్రాంఛైజీల‌తో స‌మావేశం ఏర్పాటు చే సింది. అన్‌క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్‌ల అభివృద్ధిలో ఇది పెద్ద పాత్ర పోషిస్తోందని జహీర్ ఖాన్ ఇంపాక్ట్ ప్లేయర్ నియమాన్ని ఉంచడానికి అనుకూలంగా మాట్లాడారు. సంజీవ్ గోయెంకా తాజా కామెంట్స్ తో లక్నో జట్టుతో రాహుల్ భవిష్యత్తు ఇంకా గాలిలో దీపంలాగే ఉంది. జ‌ట్టును వీడుతాడ‌నే ఊహాగానాలపై వ్యాఖ్యానించడానికి గోయెంకా నిరాకరించాడు. 

కేఎల్ రాహుల్ జ‌ట్టులో ఉంటాడ‌నే అభిప్రాయం వ్య‌క్తం చేశారు కానీ, కెప్టెన్సీపై స్ప‌ష్టంగా చెప్ప‌లేదు. వికెట్ కీపర్ జట్టులో అంతర్భాగంగా ఉంటాడనీ, తదుపరి సీజన్‌కు కెఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా నిర్ధారించడం, ప్లేయర్ రిటెన్షన్‌పై నిర్ణయం తీసుకోవడానికి స‌మ‌యం ఉంద‌ని అన్నారు. "నేను ఊహాగానాలపై వ్యాఖ్యానించదలుచుకోలేదు. కేఎల్ రాహుల్ కుటుంబం అని మాత్రమే చెబుతాను" అని సంజీవ్ గోయెంకా అన్నారు. "ప్లేయ‌ర్ల రిటెన్ష‌న్, కెప్టెన్సీపై నిర్ణయం తీసుకోవడానికి ఇంకా తగినంత సమయం ఉంది. ప్రతిదీ బాగా ఆలోచించాలి. కేఎల్ రాహుల్ సూపర్ జెయింట్స్ కుటుంబంలో ముఖ్య‌మైన వ్య‌క్తిగా" అని పేర్కొన్నాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios