Asianet News TeluguAsianet News Telugu

IPL 2022: కోల్కతాలో వర్షం.. ప్లేఆఫ్ మ్యాచులు రద్దైతే..? విజేతను నిర్ణయించేది ఇలాగే..

IPL 2022 Playoffs: ఐపీఎల్-15 తుది అంకానికి చేరింది. లీగ్ దశలు ముగిసి.. మే 24 నుంచి ప్లేఆఫ్స్ మొదలుకానున్నాయి. అయితే ప్లేఆఫ్స్ తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ కు వర్షం గండం ఉంది. 

What if Rain Disrupts Match Results, check out IPL 2022 Playoffs Rules
Author
India, First Published May 23, 2022, 6:31 PM IST

రెండునెలలుగా దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఐపీఎల్ తుది దశకు చేరింది. ఇప్పటికే లీగ్ దశ మ్యాచులను ముగించుకున్న ఐపీఎల్.. మే 24  (మంగళవారం) నుంచి ప్లేఆఫ్స్ కూడా ప్రారంభం కాబోతున్నాయి.   కాగా ప్లేఆఫ్  లో భాగంగా క్వాలిఫైయర్ మ్యాచ్ తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ కూడా  కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ లో జరగాల్సి ఉంది.  కానీ ఈ మ్యాచ్ కు వర్షం  ముంపు పొంచి ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఒకవేళ వర్షం వల్ల మ్యాచులు రద్దైతే.. మరి విజేతను ప్రకటించేది ఎలా..?  

ఈ క్రమంలో బీసీసీఐ.. ప్లేఆఫ్స్, ఫైనల్ కు కొత్త మార్గదర్శకాలు రూపొందించింది. ప్లేఆఫ్ మ్యాచులకు వర్షం ఆటంకం కలిగిస్తే సూపర్ ఓవర్ ద్వారా విజేత ను నిర్ణయించనున్నారు. అదీ వీలు కాకుంటే పాయింట్ల పట్టిక ఆధారంగా విజేత ఎవరో తేలుస్తారు. ఈ మేరకు బీసీసీఐ విడుదల చేసిన  మార్గదర్శకాలేంటో ఇక్కడ చూద్దాం. 

ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచులకు మర్గదర్శకాలు : 

- క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్, క్వాలిఫైయర్ 2 మ్యాచులకు రిజర్వ్ డే లేదు. కానీ ఫైనల్ కు రిజర్వ్ డే ఉంది. వర్షం లేదా మరేదైనా కారణం వల్ల మ్యాచ్ జరుగకుంటే  మే 29న జరగాల్సిన ఫైనల్ ను  మరుసటి రోజు (మే30) న నిర్వహిస్తారు. 
- ప్లేఆఫ్స్ మ్యాచులకు రిజర్వ్ డే లేకున్నా.. వర్షం కారణంగా మ్యాచ్  ఆలస్యంగా ప్రారంభమైతే రెండు గంటల (రిజర్వ్ టైమ్) వరకు నిర్ణీత 20 ఓవర్లలో ఎటువంటి కోత ఉండదు.
- వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం ఏర్పడితే ఇన్నింగ్స్ బ్రేక్ ను 20 నిమిషాల నుంచి 10 నిమిషాలకు కుదిస్తారు. 
- వర్షం పడి మ్యాచ్ కు ఆటంకం కలిగితే స్ట్రాటజిక్ టైమ్ అవుట్ లు ఉండవు. 
- వరుణుడి కారణంగా మ్యాచ్ కటాఫ్ టైం దాటితే ప్లేఆఫ్ మ్యాచుల్లో ఇరు జట్లు ఐదు ఓవర్ల చొప్పున ఆడేందుకు అవకాశం ఉంది. 5-5 మ్యాచ్ నిర్వహణకు రాత్రి 11.56 గంటల వరకు అవకాశముంది. ఫైనల్లో అయితే 5-5 మ్యాచ్ కు మరుసటి రోజు  వేకువ జామున 12.26 గంటల వరకు అవకాశముంది. 

 

- వర్షం వల్ల ప్లేఆఫ్ మ్యాచుల్లో పైన చెప్పుకున్నవేవీ నిర్వహణ సాధ్యం కాకుంటే సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. సూపర్ ఓవర్ కు కటాఫ్ టైమ్ (ఉదయం 12.50 గంటలు) కూడా ఉంది.
- సూపర్ ఓవర్ ద్వారా కూడా ఫలితం తేలకున్నా.. ఒకవేళ సూపర్ ఓవర్ పడే అవకాశం లేకున్నా లీగ్ దశలో  పాయింట్ల పట్టిక ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. 
- ఒకవేళ ఒక ఇన్నింగ్స్ ముగిశాక వర్షం పడితే అప్పుడు  డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ లో విజేత ను తేలుస్తారు. 
- ఇక ఫైనల్ లో  రిజర్వ్ డే  నాడు కూడా ఆట సాధ్యం కాకుంటే.. కనీసం ఐదు ఓవర్లో, సూపర్ ఓవర్ ద్వారానో ఫలితం తేలే వీళ్లేకుంటే అప్పుడు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు. 

ఐపీఎల్ ప్లేఆఫ్స్, ఫైనల్ షెడ్యూల్ ఇది..

- మే 24న తొలి క్వాలిఫైయర్ : గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్తాన్ రాయల్స్ 
- మే 25న ఎలిమినేటర్ : లక్నో సూపర్  జెయింట్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  ( ఈ రెండు మ్యాచులు ఈడెన్ గార్డెన్స్ లో)
- మే 27న రెండో క్వాలిఫైయర్ : క్వాలిఫైయర్ ఓడిన జట్టు వర్సెస్ ఎలిమినేటర్ లో గెలిచిన జట్టు 
- మే 29న ఫైనల్ : క్వాలిఫైయర్-1 విజేత వర్సెస్ క్వాలిఫైయర్-2  విజేత  (ఎలిమినేటర్ తో పాటు ఫైనల్ మ్యాచ్ ను అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిర్వహిస్తారు) 

Follow Us:
Download App:
  • android
  • ios