భారత్-వెస్టిండీస్ టెస్టు సిరీస్‌లో భాగంగా విండీస్ ఆటగాడు మిగెల్ కమిన్స్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశాడు. పదో నంబరు ఆటగాడిగా క్రీజులోకి వచ్చిన అత్యధిక బంతులు ఆడి డకౌట‌్ అయిన వెస్టిండీస్ క్రికెటర్‌గా నిలిచాడు.

మిగెల్ కంటే ముందు కె. ఆర్థర్‌టన్ 40 బంతులు, ఎం.డిల్లాన్ 29 బంతులు, సి.బట్స్ 27 బంతులు, ఆర్.అస్టిన్ 24 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరారు.

తాజాగా మిగెల్ వీరందరినీ దాటేశాడు. 2002లో ఇంగ్లాండ్‌తో లార్డ్స్‌లో జరిగిన టెస్టులో విండీస్ క్రికెటర్ కె.అర్థర్‌టన్ 40 బంతులు ఎదుర్కొని డకౌట్ అవ్వగా...అదే ఏడాది షార్జాలో జరిగిన పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎం.డిల్లాన్ 29 బంతులు ఎదుర్కొని పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు.

ఇక 1988లో భారత్‌తో చెన్నైలో జరిగిన మ్యాచ్‌లో సి.బట్స్ 27 బంతులు ఎదుర్కొని డకౌటయ్యాడు. 2009లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్.అస్టిన్ 24 బంతులు ఎదుర్కొని సున్నాకే పెవిలియన్ చేరాడు.

వీళ్లందరినీ దాటేసిన కమిన్స్ 95 నిమిషాల పాటు క్రీజులో ఉండి...45 బంతులు ఆడి డకౌట్ కావడం గమనార్హం. భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టిన మిగెల్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు.