Kieron Pollard Retirement: వెస్టిండీస్ పరిమిత ఓవర్ల సారథి కీరన్ పొలార్డ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికటె కు వీడ్కోలు పలుకుతున్నట్టు  పొలార్డ్ ప్రకటించాడు. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించాడు. 

ఐపీఎల్ లో ఇప్పటికే ఒక్క విజయం కూడా లేక తీవ్ర ఒత్తిడిలో ఉన్న ముంబై ఇండియన్స్ అభిమానులకు మరో భారీ షాక్. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్, వెస్టిండీస్ పరిమిత ఓవర్ల సారథి కీరన్ పొలార్డ్.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. విండీస్ కు వన్డే, టీ20లకు కెప్టెన్ గా ఉన్న పొలార్డ్.. తాను రిట్మైర్మెంట్ ప్రకటిస్తున్నానని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి ఫ్యాన్స్ ను షాక్ కు గురి చేశాడు. యువకులకు అవకాశమివ్వడానికే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పొలార్డ్ వెల్లడించాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా బుధవారం రాత్రి ఓ వీడియో ను విడుదల చేశాడు. 

వీడియోలో పొలార్డ్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత నేను ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నాను. నేను అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నాకు పదేళ్ల వయసున్నప్పుడే వెస్టిండీస్ తరఫున ఆడాలని కలలుగన్నాను. 

ఆ కలను నెరవేర్చుకుంటూ 15 ఏండ్ల పాటు నా జట్టుకు టీ20, వన్డేలలో ప్రాతినిథ్యం వహించాను. అందుకు ఒకింత గర్వంగా ఉంది. నా చిన్ననాటి హీరో బ్రియాన్ లారా నాయకత్వంలో 2007లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేయడం నాకు ఇంకా స్పష్టంగా గుర్తుంది. నా జాతీయ జట్టు జెర్సీ ధరించడం.. గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడటాన్ని నేనెప్పుడూ మరిచిపోలేను. దానిని నేనెప్పుడూ తేలికగా తీసుకోలేదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్నీ మనసు పెట్టి ఆడాను..’ అని సుదీర్ఘ నోట్ రాసుకొచ్చాడు. యువకులకు అవకాశమివ్వడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చాడు. 

View post on Instagram

ఈ సందర్భంగా ఇన్స్టాలో తన తొలి మ్యాచ్ తో పాటు టీ20 ప్రపంచకప్ (2012) క్షణాలు, ఆరు సిక్సర్ల మ్యాచ్ కు సంబంధించిన పుటేజీతో కూడిన వీడియో షేర్ చేశాడు. దాంతోపాటే రిట్మైర్మెంట్ నోట్ ను కూడా ఉంచాడు. అయితే అంతర్జాతీయ కెరీర్ కు గుడ్ బై చెప్పినా అతడు లీగ్ లలో కొనసాగే అవకాశం ఉంది. 

Scroll to load tweet…

2007లో విండీస్ వన్డే జట్టులో అరంగేట్రం చేసిన పొలార్డ్.. కరేబియన్ టీమ్ తరఫున 123 వన్డేలు ఆడి 2,706 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 13 హాఫ్ సెంచరీలున్నాయి. బౌలింగ్ లో 55 వికెట్లు తీసుకున్నాడు. వన్డేల సంగతి పక్కనబెడితే పొలార్డ్ అంటేనే గుర్తొచ్చేది టీ20 లు. విండీస్ తరఫున 101 టీ20లు ఆడిన ఈ ఆల్ రౌండర్.. బ్యాటింగ్ లో 1,569 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 42 వికెట్లు తీసుకున్నాడు. వివిధ ఫ్రాంచైజీల తరఫున 581 టీ20లు ఆడిన పొలార్డ్.. 11,427 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 304 వికెట్లు తీసుకున్నాడు. పొలార్డ్.. తన ఆఖరి వన్డే, టీ20లను భారత్ మీదే (ఫిబ్రవరిలో) 
ఆడటం విశేషం.