ENG vs NZ: ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య లీడ్స్ లో జరుగుతున్న మూడో టెస్టులో కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ ఔటైన తీరు పై తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు.  

ఇంగ్లాండ్ తో లీడ్స్ లో మూడో టెస్టు ఆడుతున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో అనూహ్య పరిస్థితుల్లో ఔటైన కివీస్ బ్యాటర్ హెన్రీ నికోల్స్ ఔట్ పై తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు. తమ దగ్గర గల్లీ క్రికెట్ లో అయితే ఇలా ఔటైతే బ్యాటర్ ను అలాగే క్రీజులో ఉంచి నాన్ స్ట్రైకర్ ను ఔటిస్తామని కామెంట్ చేశాడు. సచిన్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 55వ ఓవర్లో హెన్రీ నికోల్స్ ఇంగ్లాండ్ స్పిన్నర్ జాక్ లీచ్ బౌలింగ్ లో నాన్ స్ట్రైకర్ గా ఉన్న డారెల్ మిచెల్ వైపు షాట్ ఆడాడు. అప్పుడక్కడ ఉన్న మిచెల్ ఆ బంతిని తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. 

కానీ బంతిని తప్పించుకునే క్రమంలో మిచెల్ పక్కకు జరిగినా బాల్ అతడి బ్యాట్ కు తాకి అంపైర్ మీదుగా మిడ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేస్తున్న అలెక్స్ లీస్ చేతుల్లోకి వెళ్లింది. అంపైర్ నికోల్స్ ను ఔటిచ్చాడు. దీంతో ఈ ఔట్ పై చర్చ మొదలైంది. అయితే క్రికెట్ చట్టాల సంరక్షుకుడిగా ఉండే మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) దీనిపై స్పందిస్తూ అంపైర్ ఔటివ్వడం సక్రమమే అని అది క్రికెట్ చట్టాలలో కూడా ఉందని తెలిపింది. 

Scroll to load tweet…

ఎంసీసీ స్పందిస్తూ.. ‘దురదృష్టవశాత్తు నికోల్స్ ఔటయ్యాడు. కానీ ఇది పూర్తిగా చట్టాలకు లోబడి తీసుకున్న నిర్ణయమే. క్రికెట్ చట్టాలలోని 33.2.2.2 నియమం ప్రకారం బంతి.. వికెట్‌, అంపైర్‌, ఫీల్డర్, ఇతర బ్యాటర్‌ని తాకిన తర్వాత క్యాచ్ పడితే అది ఔట్‌గా పరిగణించబడుతుంది’ అని ట్విటర్ వేదికగా స్పందించింది’ అని రాసుకొచ్చింది.

ఇక తాజాగా దీనిపై సచిన్ టెండూల్కర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘మా దగ్గర గల్లీ క్రికెట్ లో అయితే నాన్ స్ట్రైకర్ ను ఔట్ గా ప్రకటిస్తాం..’ అని ఫన్నీ ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…