Asianet News TeluguAsianet News Telugu

Tim Paine: ఈ చాట్ బయటకు రావాలే గానీ మన కొంప కొల్లేరే.. లీకైన ఆసీస్ మాజీ కెప్టెన్, మహిళా ఉద్యోగి చాట్

Tim Paine Text: 2017లో తనతో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో కలిసి లైంగికపరమైన సందేశాలు పంపినందుకు గాను టిమ్ పైన్ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో తాను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సారథిగా ఉండటానికి అనర్హుడినంటూ శుక్రవారం సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 

We are both finished if this chat gets out, Text Reveals Tim paine Knew Exactly what he Was doing
Author
Hyderabad, First Published Nov 20, 2021, 10:49 AM IST

తన సహోద్యోగితో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కారణంగా ఆస్ట్రేలియా (Australia) టెస్టు జట్టు  కెప్టెన్ టిమ్ పైన్ (Tim Paine) సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఈ అంశమ్మీద విచారణ చేపట్టిన క్రికెట్ ఆస్ట్రేలియా (Cricket Australia).. అతడిని సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. అయితే.. మహిళా ఉద్యోగితో పైన్ జరిపిన చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ బయటకు లీకయ్యాయి. అందులో ఆ మహిళ.. ‘ఈ చాట్ లీకైతే మనిద్దరి పని అయిపోతుంది..’ అనగా పైన్ దానికి అంతకంటే అసహ్యకరమైన రిప్లై ఇచ్చాడు.  ఈ టెక్ట్స్ మెసేజ్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ (Tim Paine leaked Chat) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

2017లో తనతో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగితో కలిసి లైంగికపరమైన సందేశాలు పంపినందుకు గాను పైన్ విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అసభ్యకరమైన సందేశాలతో పాటు తన పురుషాంగాన్ని కూడా ఫోటో తీసి పంపాడని సదరు మహిళ క్రికెట్ ఆస్ట్రేలియాకు ఫిర్యాదు చేసింది. తాజాగా లీకైన చాట్ లో కూడా పైన్ అలా చేశాడనడానికి కూడా ఆధారాలు అందినట్టు అయింది. ఈ ఉదంతం నేపథ్యంలో ఆమె 2018లో  తన ఉద్యోగానికి రాజీనామా చేయగా.. శుక్రవారం పైన్ ఆసీస్ టెస్టు జట్టు సారథిగా తప్పుకున్నాడు.

We are both finished if this chat gets out, Text Reveals Tim paine Knew Exactly what he Was doing 

లీకైన చాట్ లో పైన్.. తన రసజ్ఞతను బయటపెట్టాడు. ఈ చాట్ లీకైతే మనిద్దరి పని అయిపోతుందని ఆమె చెప్పగా.. దానికి పైన్ ‘అవునా..? అయితే నువ్వు నా పని చేయి మరి (నాతో సెక్స్ చేయి అనే  అర్థం వచ్చే విధంగా)..’ అంటూ మెసేజ్ లు పెట్టాడు. ఇవే పైన్ కొంప ముంచాయి.

 

2017లో తన తో పని చేస్తున్న ఓ మహిళకు పైన్ అసభ్యకరమైన రీతిలో సందేశాలు పంపాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. ఇందుకు సంబంధించి సదరు మహిళ క్రికెట్ ఆస్ట్రేలియా కు ఫిర్యాదు చేసింది. దీనిపై సీఏ విచారణ చేపట్టింది. పైన్  ను కూడా విచారించింది. ఇద్దరి వాదనలు విన్న బోర్డు.. పైన్ పై చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం అనూహ్యంగా మీడియా ముందుకు వచ్చిన అతడు.. తాను ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు సారథిగా ఉండటానికి అనర్హుడినంటూ  తెలిపిన విషయం  తెలిసిందే. 

త్వరలో యాషెస్ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు ఇది పెద్ద ఎదురుదెబ్బే. ప్రతిష్టాత్మక సిరీస్ కు ముందు ఆ జట్టును ఇది మానసికంగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే పైన్ స్థానంలో కెప్టెన్ గా ఎవరిని నియమిస్తారనేదానిమీద ఇంకా  క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తీసుకోలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios