న్యూజిలాండ్ క్రికెటర్లపై ప్రస్తుతం నెటిజన్లు ప్రశసంల వర్షం కురిపిస్తున్నారు.  ఇటీవల న్యూజిలాండ్ సీనియర్ క్రికెటర్ టీమ్... భారత్ చేతిలో సిరీస్ చేజార్చుకుంది. అయితే... జూనియర్ టీమ్ మాత్రం అదరగొడుతోంది. అండర్ -19 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ టీమ్ దూసుకుపోతోంది. అయితే... ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్స్ లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఈ జట్టు.. మైదానంలో తమ క్రీడా స్ఫూర్తిని చూపించారు.

దీంతో... వారిపై నెటిజన్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అంతలా వాళ్లపై పొగడ్తల వర్షం కురవడానికి కారణమేంటో తెలుసా..? ప్రత్యేర్థి టీమ్ బ్యాట్స్ మన్ కి సహరించడం. మన జట్టువాళ్లకి ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే స్పందిస్తాం. కానీ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్ మన్ కి గాయమైనా వెంటనే స్పందించి బుజాలపై మోసుకెళ్లారు. 

పూర్తి మ్యాటర్ లోకి వెళితే ... ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ 47.5 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది. దాంతో 239 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కివీస్‌ రెండు బంతులు మిగిలి ఉండగా విజయం సాధించి సెమీస్‌లోకి ప్రవేశించింది. అయితే విండీస్‌ బ్యాటింగ్‌ చేసే క్రమంలో సెకండ్‌ డౌన్‌లో వచ్చిన కిర్క్‌ మెకంజీ కుడి కాలు పట్టేయడంతో విపరీతమైన నొప్పితో సతమతమయ్యాడు.

Also Read సూపర్ ఓవరు వేసిన బుమ్రా, ఎందుకంటే: రోహిత్ శర్మ జవాబు...

ఈ క్రమంలోనే 99 పరుగుల వద్ద ఉండగా రిటర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. 43 ఓవర్‌ చివరి బంతికి పెవిలియన్‌ వీడాడు. కాగా, విండీస్‌ తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన తర్వాత మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన మెకంజీ 99 పరుగుల వద్దే ఆఖరి వికెట్‌గా ఔటయ్యాడు. మళ్లీ స్టైకింగ్‌కు వచ్చి ఆడిన తొలి బంతికే బౌల్డ్‌ అయ్యాడు. దాంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ 13 బంతులు ఉండగా ముగిసింది.

 

అయితే కాలిపిక్క గాయంతో సతమతమైన మెకంజీ పెవిలియన్‌కు చేరుకునే క్రమంలో ఇబ్బంది పడ్డాడు. విపరీతమైన నొప్పితో సతమతమవుతూ నడవడానికి ఇబ్బంది పడటంతో కివీస్‌ ఆటగాళ్లు ఇద్దరు అతన్ని భుజాలపై వేసుకుని బౌండరీ లైన్‌ వరకూ తీసుకెళ్లి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు. దీనిపై టీమిండియా ఆటగాడు రోహిత్‌ శర్మ తన ట్వీటర్‌ అకౌంట్‌లో ‘ఇది కదా స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌’ అంటూ  పోస్ట్‌ చేశాడు. ఇదొక మంచి పరిణామమని పేర్కొన్నాడు