ఆస్ట్రేలియాపై టీమిండియా పగ తీర్చుకుంది. ప్రస్తుతం టీమిండియా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం తలపడుతున్న సంగతి తెలిసిందే. కాగా... తొలి వన్డే మ్యాచ్ లో చిత్తుగా ఓడిపోయిన టీమిండియా... రెండో వన్డేలో చిత్తురేగ్గొట్టింది. కంగారులను కంగారుపెట్టించి.. రెండో వన్డేని దక్కించుకుంది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అదరగొట్టాడు. 

Also Read మనీష్ పాండే క్యాచ్ కు షాక్ తిన్న డేవిడ్ వార్నర్...

రాజ్ కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఏదైన మ్యాచ్ లో భారత్ విజయం సాధించగానే.. చాహల్ మైక్ పట్టుకొని వచ్చి హంగామా చేస్తూ ఉంటాడు. ఎవరినో ఒకరిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు.  అంతేకాదు.. అప్పుడప్పుడు టీమిండియా క్రికెటర్లు ఖాళీగా ఉన్నప్పుడు కూడా చాహల్ టీవీ అంటూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతుంటాడు. ఈ విధంగా చాహల్ టీవీ బాగా పాపులర్ అయ్యింది.

 

అయితే... నిన్న మ్యాచ్ అనంతరం చాహల్ టీవీ శిఖర్ ధావన్ చేతిలోకి వెళ్లిపోయింది. కేఎల్ రాహుల్ ని శిఖర్ ధావన్ ఇంటర్వ్యూ చేశాడు. చాహల్ టీవీ కోసం ఎదురు చూస్తున్నారా అంటూ.. మొదలుపెట్టిన ధావన్... ఇప్పుడు అది తన వద్దకు వచ్చిందంటూ చమత్కరించాడు. చాహల్ తన పళ్ల సమస్యను ఫిక్స్ చేసుకోవడానికి వెళ్లాడంటూ జోకులు వేశాడు. చాహల్ ని, అతని పళ్లను అందరూ మిస్ అవుతున్నారంటూ కాసేపు ట్రోల్ చేశాడు. ధావన్ కామెంట్స్ కి పక్కనే ఉన్న కేఎల్ రాహుల్ పడిపడి నవ్వేశాడు. ఈ వీడియోని బీసీసీఐ షేర్ చేయగా.... నెట్టింట వైరల్ గా మారింది.