టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ తన ముద్దుల కుమార్తె సమైరాతో సమయం గడుపుతున్నాడు. మామూలుగా అయితే...ఐపీఎల్ తో బిజీ బిజీగా గడపాల్సి ఉండేది. కరోనా వైరస్ ప్రభావంతో... ఐపీఎల్ కాస్త వాయిదా పడింది. 

కరోనా అదుపులోకి వచ్చే వరకు ఐపీఎల్ మ్యాచ్ పెట్టే అవకాశం కనపడట్లేదు. అప్పటి వరకు క్రికెటర్లంతా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఆ సమయంలో కొందరు కసరత్తులు చేస్తూ టైమ్ పాస్ చేస్తుంటే.. రోహిత్ మాత్రం తన ఫ్యామిలీకే సమయం కేటాయించాడు.

Also Read కరోనా ఎఫెక్ట్ : పందులు ప్రశాంతంగా వీధుల్లో .. రోహిత్ శర్మ షాకింగ్ కామెంట్స్..

 రోహిత్ శర్మ ఇప్పుడు తన ఇంట్లో తన కూతురు సమైరాతో కలిసి సరదాగా క్రికెట్ ఆడుతున్నాడు. తన కూతురు సమైరా కోసం ప్రత్యేకంగా కొనుగోలు చేసిన బ్యాట్‌‌ తో ఆమెకి రోహిత్ శర్మ బ్యాటింగ్ పాఠాలు నేర్పిస్తున్నాడు. కాకపోతే క్రికెట్ బాల్ స్థానంలో ఫుట్‌బాల్‌‌‌ని  ఉంచి నేర్పిస్తున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😍🙌

A post shared by Rohit Sharma (@rohitsharma45) on Mar 22, 2020 at 5:06am PDT

 

సమైరా తన చిన్ని చిన్ని చేతులతో బ్యాట్ పట్టుకొని క్రికెట్ ఆడుతున్న వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. బుజ్జి క్రికెటర్ అంటూ సమైరాని ఉద్దేశించి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.