టీమిండియా కుర్రాళ్లు రెచ్చిపోయారు. మొన్న చెన్నై వేదికగా జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ జట్టును గడగడలాడించారు. తొలి టెస్టు కోల్పోయినా.. రెండో టెస్టులో అదిరిపోయే స్కోర్ తో రెచ్చిపోయారు. చివరకు కోహ్లీ సేనకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ ఆల్ రౌండర్ పర్ఫ్మామెన్స్ తో రవిచంద్రన్ అశ్విన్ అదరగొట్టాడు. అయితే.. కేవలం స్టేడియంలోనే కాదు.. డ్యాన్స్ ఫ్లోర్ మీద కూడా తాను అదరగొట్టగలనంటూ తాజా వీడియోలో నిరూపించాడు.

త్వరలో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో మూడో పింక్ బాల్ టెస్టు జరనున్న సంగతి తెలిసిందే. కాగా.. దీనికి ముందు టీమిండియా ఆటగాళ్లు కాస్త రిలాక్స్ అయ్యారు. ఇటీవల సూపర్ హిట్ అయిన తమిళ సూపర్ హీరో విజయ్ మాష్టర్ సినిమాలోని ఓ పాటకు చిందులేశారు.

మాష్టర్ సినిమాలోని ‘వాతి కమింగ్’ పాట ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. కాగా... ఆ పాటకు తాజాగా రవిచంద్రన్ అశ్విన్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లు స్టెప్పులేశారు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో ఇప్పుడు అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ashwin (@rashwin99)