Asianet News TeluguAsianet News Telugu

ట్రోలింగ్‌లో ఇది నెక్స్ట్ లెవల్.. దీప్తి ‘రనౌట్’ విషయంలో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లకు కౌంటరిచ్చిన జాఫర్

Deepti Sharma Run Out Row: దీప్తిశర్మ రనౌట్ వ్యవహారం ముదిరిపాకాన పడింది. దీనిపై ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు అవాకులు చెవాకులు పేలుతున్నారు.  క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కాకరకాయ కబుర్లు చెబుతున్నారు. 

Wasim Jaffer Trolls English Media and Cricketers With His Own Style, Watch Video Here
Author
First Published Sep 30, 2022, 3:40 PM IST

టీమిండియా   మహిళా  క్రికెటర్ దీప్తి శర్మ ఇటీవల ఇంగ్లాండ్ తో లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో ప్రత్యర్థి జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ (నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో మన్కడ్ రూపంలో) చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు అవాకులు చెవాకులు పేలుతున్నారు.  క్రికెట్ చట్టాల్లో ఈ నిబంధన ఉన్నా ఇలా ఔట్ చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కాకరకాయ కబుర్లు చెబుతున్నారు. ఇక ఇంగ్లీష్ మీడియా అయితే  ఈ వ్యవహారాన్ని ఇప్పట్లో విడిచేలా లేదు. కనబడిన ప్రతి క్రికెటర్ దగ్గరికి వెళ్లి ప్రపంచ క్రికెట్ లో  మరే సమస్య లేనట్టు ఇదే  అంశాన్ని ప్రస్తావిస్తున్నది.  

ఈ నేపథ్యంలో  భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్..  ఒక్క ట్వీట్ తో ఇంగ్లీష్ మీడియా, క్రికెటర్లు, విశ్లేషకులు, విమర్శకుల నోళ్లు మూయించాడు. తాజాగా  జాఫర్ ఓ ట్వీట్ లో.. ఇటాలియన్ సైక్లిస్టు  మైఖేల్ గరియాకు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేస్తూ ఇంగ్లీష్ మీడియాకు కౌంటరిచ్చాడు. 

ట్విటర్ లో ఇయాన్  ప్రేసర్ అనే  జర్నలిస్టు ఓ వీడియోను ఉంచాడు. ఆ వీడిలో ఇటాలియన్ సైక్లిస్టు  మైఖేల్ గరియా.. తన ముందున్న వారిని దాటేయడానికి గాను  సైకిల్ ను  వేగంగా తొక్కి తర్వాత తన బాడీని  సీట్ మీద ఫ్లాంక్ పొజిషన్ లో ఉంచుతాడు.  దీంతో సైకిల్.. తన ముందున్న  సైకిళ్లను దాటేసుకుంటూ ముందుకు వెళ్తుంది. 

ఈ  వీడియోను  జాఫర్ రీట్వీట్ చేస్తూ.. ‘ఇది (గరియా చేసిన పని) వాస్తవానికి చట్టబద్దమైనదే కావచ్చు. నిబంధనల్లో ఉండొచ్చు. కానీ  ఇది సైక్లింగ్ స్ఫూర్తికి విరుద్ధం.. అని ఇ ఓ ఇంగ్లీష్ సైక్లిస్టు చెప్పాడు..’ అని  రాసుకొచ్చాడు.  పేరు చెప్పకపోయినా జాఫర్.. ఈ ట్వీట్ ద్వారా ఇంగ్లీష్ మీడియా,  క్రికెటర్ల వ్యాఖ్యలకు కౌంటరిచ్చినట్టేనని స్పష్టమవుతున్నది. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నది. 

 

ఇక ఈ రనౌట్ పై ఇటీవల ఇంగ్లాండ్  పురుషుల జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ స్పందించాడు. తానైతే  ఇలా ఔట్ అయితే సదరు బ్యాటర్ ను వెనక్కి పిలుస్తానని చెప్పుకొచ్చాడు. బట్లర్ మాట్లాడుతూ.. ‘నా కెప్టెన్సీలో గనక ఇలాంటి ఘటన జరిగితే నేను ఆ బ్యాటర్ ను వెనక్కి పిలుస్తాను..’అని చెప్పాడు. మరో ఇంగ్లాండ్ క్రికెటర్  మోయిన్ అలీ మాట్లాడుతూ.. తాను అసలు ఇలాంటివి చేయనని, కానీ ఈ నిబంధనను చట్టాల నుంచి తీసేయాలని  తెలిపాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios