ప్రపంచకప్ లలో తాము భారత్ ని ఓడించలేదనేది నిజమేనని.. కానీ ఇరు జట్ల మధ్య జరిగగిన అన్ని మ్యాచుల్లో పాకిస్తాన్ ఎక్కువ విజయాలు సాధించిందని ఆయన అన్నారు.

ICC t20 Worldcup సమరం మొదలైంది. మరో రెండు రోజుల్లో క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారత్- పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ ఈ సందర్భంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రపంచకప్ టోర్నీలో భారత్- పాక్ మ్యాచ్ ల రికార్డులు, గణాంకాలు ఇరు జట్లలోని ఆటగాళ్లలో ఎవరూ పట్టించుకోరని వసీమ్ అక్రమ్ పేర్కొన్నారు.

Also Read: ఒకే ఓవర్‌లో 8 సిక్సర్లు... చితక్కొట్టుడు అంతే ఇదేనేమో... ఆస్ట్రేలియా బ్యాటర్ రికార్డు.

ఆదివారం భారత్- పాక్ మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఆయన ఈ కామెంట్స్ చేశాడు, దుబాయ్ లో నిర్వహిస్తున్న సలాం క్రికెట్ కార్యక్రమంలో అక్రమ్ పాల్గొన్నాడు. ప్రపంచకప్ లలో తాము భారత్ ని ఓడించలేదనేది నిజమేనని.. కానీ ఇరు జట్ల మధ్య జరిగగిన అన్ని మ్యాచుల్లో పాకిస్తాన్ ఎక్కువ విజయాలు సాధించిందని ఆయన అన్నారు.

Also Read: India vs Pakistan: భారత్ తో మ్యాచ్ లో పాక్ ఓడిపోతే బ్యాగ్ సర్దుకోవాల్సిందే.. ఆసీస్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యలు

తాను ఐదు వన్డే మ్యాచ్ లు భారత్ ఆడినా.. ఇప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదన్నాడు. అయితే.. భారత్-పాక్ ఆటగాళ్లు ప్రపంచకప్ టోర్నీలో బరిలోకి దిగేటప్పుడు ఇవన్నీ పట్టించుకోరన్నారు. భారత్-పాక్ జట్టు లోని ఏ క్రికెటర్ రికార్డులతో పని ఉండదని ఆయన అన్నారు.

ప్రపంచకప్ ఈవెంట్లలో ప్రతి మ్యాచ్ ముఖ్యమేనని.. ప్రతి జుట్టూ విజయం కోసమేనని.. అక్కడ ఆడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే.. భారత్- పాక్ మ్యాచ్ కి మాత్రం ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.