ఎంతటి అరవీర భయంకరమైన బ్యాట్స్‌మెన్ అయినా బంతిని గాల్లోకి లేపిన తర్వాత అది సిక్సర్ వెళ్లిందా... లేక ఫీల్డర్ చేతుల్లోకి వెళ్లిందా? అనే అనుమానంతో బంతిని చూస్తాడు. కానీ బ్రిస్బేన్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన వాషింగ్టన్ సుందర్ మాత్రం సిక్స్ కొట్టిన తర్వాత బంతి వైపు చూడను కూడా చూల్లేదు...

శార్దూల్ ఠాకూర్ అవుటైన తర్వాత వందో టెస్టు ఆడుతున్న నాథన్ లియాన్ బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఈ సిక్సర్‌కి ఐసీసీ ‘నో లుక్ సిక్సర్’ అని నామకరణం కూడా చేసేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా అయితే... ‘ఇది మరీ స్పైసీ.... చూడకుండానే సిక్సర్ బాదేశాడు’ అంటూ సుందర్ సిక్సర్‌ను వర్ణించింది.

వాషింగ్టన్ సుందర్ కొట్టిన ఈ సిక్సర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సుందర్‌లాంటి కాన్ఫిడెన్స్ ఉంటే జీవితంలో దేన్నైనా ఈజీగా ఎదుర్కోవచ్చని అంటున్నారు నెటిజన్లు...