ఓవర్‌నైట్ స్కోర్ 294/1 వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని అందించారు. ఈ ఇద్దరూ కలిసి ఎనిమిదో వికెట్‌కి 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

అయితే 97 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్‌తో 43 పరుగులు చేసిన అక్షర్ పటేల్ రనౌట్ కావడంతో సీన్ మారిపోయింది. అక్షర్ పటేల్ రనౌట్ అయిన తర్వాతి బంతికే ఇషాంత్ శర్మ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత మూడో బంతికి సిరాజ్ కూడా బెన్‌స్టోక్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

దీంతో 174 బంతుల్లో 10 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 96 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్, సెంచరీకి 4 పరుగుల దూరంలో నిలిచి నాటౌట్‌గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 365 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా, ఇంగ్లాండ్‌పై 160 పరుగుల ఆధిక్యం సంపాదించింది.