కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 టోర్నీలో లంకాషైర్ తరుపున ఆరంగ్రేటం చేసిన వాషింగ్టన్ సుందర్... రెండో బంతికే వికెట్ తీసిన భారత ఆల్‌రౌండర్.. 

గాయం కారణంగా టీమిండియాలో చోటు కోల్పోయిన వాషింగ్టన్ సుందర్, కౌంటీల్లో ఆరంగ్రేటం చేశాడు. నార్తింగ్టన్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లంకాషైర్ తరుపున ఆరంగ్రేటం చేస్తున్నాడు వాషింగ్టన్ సుందర్. గత ఏడాది ఇంగ్లాండ్ టూర్‌లో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో గాయపడిన వాషింగ్టన్ సుందర్, ఆ తర్వాత పెద్దగా క్రికెట్ ఆడలేకపోయాడు...

ఐపీఎల్ 2022 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడిన వాషింగ్టన్ సుందర్, కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు...

కౌంటీ ఆరంగ్రేటం సందర్భంగా లంకాషైర్ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు వాషింగ్టన్ సుందర్. ..

Scroll to load tweet…

‘నేను ప్లేస్టేషన్‌లో లంకాషైర్ తరుపున చాలా మ్యాచులు ఆడాను. ఎప్పుడూ కూడా ఆండ్రూ ఫ్లింటాఫ్‌ క్యారెక్టర్‌ను తీసుకునేవాడిని. ఫ్లింటాఫ్ అయితే నాలుగు ఓవర్లు వేస్తాడు, సాలిడ్ పేస్‌తో అదరగొడతాడు... 

అదీకాకుండా అతను ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి భారీ సిక్సర్లు బాదుతాడు... అందుకే ఆండ్రూ ఫ్లింటాఫ్ క్యారెక్టర్‌నే ఎంచుకునేవాడిని. అలాగే జేమ్స్ అండర్సన్ కూడా. అతను రెండువైపులా బంతిని స్వింగ్ చేయగల లెజెండ్... అతన్ని కలవడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా... అవకాశం వస్తే అతని బౌలింగ్‌ని దగ్గరగా చూడాలని ఉంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు వాషింగ్టన్ సుందర్...

Scroll to load tweet…

‘వైట్ బాల్ క్రికెట్ కంటే రెడ్ బాల్ క్రికెట్ ఆడడమంటేనే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ టెస్టు మ్యాచులు ఆడాలని కోరుకునే వ్యక్తిని... ’ అంటూ కామెంట్ చేశాడు వాషింగ్టన్ సుందర్...

కౌంటీ ఛాంపియన్‌షిప్ 2022 సీజన్‌లో మొదటి ఓవర్ రెండో బంతికే వికెట్ తీసి, అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్నాడు వాషింగ్టన్ సుందర్. 24 బంతుల్లో 2 పరుగులు చేసిన విల్ యంగ్, వికెట్ కీపర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు... 

టీమిండియా తరుపున 4 వన్డేలు, 4 టెస్టులు ఆడిన వాషింగ్టన్ సుందర్, మొత్తంగా 11 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో 3 హాఫ్ సెంచరీలు చేసిన వాషింగ్టన్ సుందర్, ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. 31 టీ20 మ్యాచులు ఆడిన వాషింగ్టన్ సుందర్, 25 వికెట్లు పడగొట్టాడు..