బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకుని అంతర్జాతీయ క్రికెట్ నుండి నిషేధానికి గురయ్యాడు ఆసిస్ ఆటగాడు డేవిడ్ వార్నర్. దీంతో ఇక అతడి క్రికెట్ కెరీర్ ముగిసిందని అందరూ అనుకున్నారు. అయితే నిషేధం ముగిసిన తర్వాత అతడు ఆడిన మొట్టమొదటి టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఇందులో అతడు సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున బరిలోకి దిగి అద్భుతం చేశాడు. ఇప్పటివరకు జరిగిన ఐపిఎల్ మ్యాచుల్లో అదరగొట్టిన వార్నర్ 692 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇలా తన కెరీర్ ముగిసిందని విమర్శించిన వారికి బ్యాట్ తోనే వార్నర్ సమధానం చెప్పాడు. 

అయితే ఇలా నిషేదం తర్వాత వెంటనే ఐపిఎల్ ఆడిన వార్నర్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో అనుబంధం ఏర్పడింది. ఈ సీజన్ మెత్తం వార్నర్ వెంటే వున్న   భార్య కాండిస్, కూతురు కూడా ఆరెంజ్ ఫ్యామిలీలో సభ్యులుగా మారిపోయారు. అయితే ప్రపంచ కప్ కోసం ఆస్ట్రేలియా జట్టులో ఎంపికైన వార్నర్ సోమవారం ఈ ఐపిఎల్ సీజన్లో చివరి మ్యాచ్ ఆడాడు. 

ఇలా మనసుకు దగ్గరయిన జట్టును వదిలివెళ్లడం బాధగా వుందంటూ వార్నర్ తో పాటు ఆయన కుటుంబసభ్యులు భావోద్వేగానికి లోనవుతున్నారు. ఈ సందర్భంగా వార్నర్ భార్య కాండిస్ ఉద్వేగాన్ని ట్విట్టర్ ద్వారా బయటపెట్టింది. '' ఈ ఐపిఎల్ ను అద్భుతంగా డేవిడ్ వార్నర్ అద్భుతంగా ముగించాడు. మా కూతురు, నేను అతన్ని చూసి ఎప్పుడూ గర్వపడుతుంటాం. నిబద్దతతో కూడిన నీ ఆటతీరు, ఎప్పటికి ఓటమిని ఒప్పుకోని నీ వ్యక్తిత్వం ప్రేరణనిచ్చింది. వి లవ్ యూ'' అంటూ కాండిస్ ట్వీట్ చేసింది. 

మరో ట్వీట్ లో '' సన్ రైజర్స్ ఫ్యామిలీ మాపపై చూపించిన ఆదరాభిమానాలను తాను మాటల్లో వ్యక్తం చేయలేను. కేవలం ఈ ఐపిఎల్ సీజన్లోనే కాదు గత సీజన్లో కూడా మీరెంతో అభిమానాన్ని చూపించారు. చాలా విరామం తర్వాత వార్నర్ మళ్లీ ఐపిఎల్ లో పునరాగమనం చేయడం చాలా ఆనందాన్నిచ్చింది.'' అని హైదరాబాద్ అభిమానులు తమపై చూపించిన ప్రేమను తలచుకుని కాండిస్ వార్నర్ భావోద్వేగానికి లోనయ్యారు.