Asianet News TeluguAsianet News Telugu

హాస్పిటల్లో చికిత్స పొందుతూ లక్ష్మణ్ ట్వీట్... నెటిజన్ల సెటైర్లు

భారత మాజీ క్రికెటర్, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు వివిఎస్ లక్ష్మణ్ చేసిన  ఓ పనిపై అభిమానులు తెగ స్పందిస్తున్నారు. తమ అభిమాన ఆటగాడు బాధపడుతుంటే ఓదార్చాల్సింది మానేసి అభిమానులు అతడిపై సెటైర్లు వేస్తున్నారు. అయితే లక్ష్మణ్ తన బాధను వ్యక్తపర్చిన విధానం కూడా అలాగే వుండటంతో అభిమానులను కూడా ఎవరూ తప్పుబట్టడం లేదు. 

vvs laxman tweet...netizens satires
Author
Hyderabad, First Published May 1, 2019, 3:57 PM IST

భారత మాజీ క్రికెటర్, క్రికెట్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు వివిఎస్ లక్ష్మణ్ చేసిన  ఓ పనిపై అభిమానులు తెగ స్పందిస్తున్నారు. తమ అభిమాన ఆటగాడు బాధపడుతుంటే ఓదార్చాల్సింది మానేసి అభిమానులు అతడిపై సెటైర్లు వేస్తున్నారు. అయితే లక్ష్మణ్ తన బాధను వ్యక్తపర్చిన విధానం కూడా అలాగే వుండటంతో అభిమానులను కూడా ఎవరూ తప్పుబట్టడం లేదు. 

ఏం జరిగిందంటే...

హైదరబాదీ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతూ డెంటల్ ఆస్పత్రిలో చేరాడు. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రస్తుతం డెంటల్ స్పెషలిస్ట్ అయిన పార్థ సాల్వేకర్ సమక్షంలో చికిత్స చేయించుకున్నాడు. ఈ సందర్భంగా లక్ష్మణ్ నొప్పికి కారణమైన పాడైపోయిన దవడ పంటిని డాక్టర్ తొలగించారు. అయితే తన బాధను  అభిమానులతో పంచుకోవాలనుకున్నాడో లేక తన స్నేహితుడికి ప్రచారం కల్పించాలనుకున్నాడో ఏమోగాని హాస్పత్రిలో చికిత్స పొందుతూ దిగిన  ఫోటోలను ట్విట్టర్లో పోస్టు చేశాడు. అంతేకాకుండా ఈ ఫోటోకు ఓ సందేశాన్ని జతచేశాడు. 

'' బాధ అనేది రెండు రకాలుగా వుంటుంది. ఒకటి మానసికమైనది కాగా మరొకటి  శారీరకమైనది. కానీ ఆ రెండింటి అనుభవాన్ని ఒకేసారి అందించేదే పంటినొప్పి. అలాంటి తీవ్ర నొప్పితో బాధపడుతూ చికిత్స చేయించుకున్నాడు. బాల్య మిత్రుడు, స్కూల్, కాలేజీ రోజుల్లో తమ జట్టు కెప్టెన్, ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డెంటిస్ట్  పార్థ సత్వలేకర్ సమక్షంలో చికిత్స చేయించుకున్నాను.'' అంటూ లక్ష్మణ్ తన స్నేహితుడితో కలిసి హాస్పిటల్లో దిగిన ఫోటోను జతచేస్తూ ట్వీట్ చేశాడు. 

లక్ష్మణ్ చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తెగ రియాక్ట్ అవుతున్నారు. కొందరు కామెడీగా, మరికొందరు సీరియస్ గా, ఇంకొందరు సెటైరికల్ గా ఈ ట్వీట్ పై కామెంట్స్ చేస్తున్నారు. '' మీ స్నేహితున్ని కలుసుకోడానికి మరిన్ని సార్లు ఇలాగే ఆస్పత్రికి వెళ్లాలని కోరుకుంటున్నాం'' అంటూ ఓ వ్యక్తి సెటైర్ వేశాడు. '' రోహిత్ కు పుట్టినరోజు గిఫ్ట్ ఇవ్వడానికి పంటిని పీకించుకున్నావా?'' అంటూ కామెడీగా ట్వీట్ చేశారు. ఇక చాలా మంది మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు లక్ష్మణ్ ట్వీట్ పై కామెంట్ చేశారు.     

 

Follow Us:
Download App:
  • android
  • ios