Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ స్థానంలో వివిఎస్ లక్ష్మణ్..

ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి పాలైన భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగకూడదని రాహుల్ ద్రవిడ్ నిర్ణయించుకున్నాడు. టోర్నమెంట్ ముగియడంతో ద్రవిడ్ రెండేళ్ల కాంట్రాక్ట్ ముగిసింది. తానింకా కొనసాగనన్న నిర్ణయాన్ని బీసీసీఐకి తెలిపారు. ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా నియమితులయ్యారు. 

VVS Laxman replaced Rahul Dravid as the head coach of Team India - bsb
Author
First Published Nov 23, 2023, 10:03 AM IST

ముంబై : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలవడంతో ఇక రాహుల్ ద్రవిడ్‌ శకం ముగిసినట్లే. భారత్ జట్టుకు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌ కు ఇది చివరి మ్యాచ్. ప్రపంచ కప్ ముగియడంతో  లెజెండరీ బ్యాటర్ రెండేళ్ల కాంట్రాక్ట్ ముగిసింది. ఈ తరువాత భారత జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగకూడదని నిర్ణయించుకున్నారని, అదే విషయాన్ని BCCIకి తెలియజేసినట్లు బీసీసీఐలోని అధికారులు ధృవీకరించాయి.

గురువారం నుంచి వైజాగ్‌లో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20I సిరీస్‌లో తలపడే రెండవ-శ్రేణి భారత జట్టుకు ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా ఉన్న వివిఎస్ లక్ష్మణ్‌ను ద్రవిడ్ స్తానాన్ని భర్తీ చేయనున్నారు. రాహుల్ ద్రవిడ్, లక్ష్మణ్ లు మంచి స్నేహితులు. లక్ష్మణ్ బెంగుళూరులోని బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీకి హెడ్ గా ఉన్నారు. ప్రపంచ కప్‌కు ముందు ఐర్లాండ్ T20I సిరీస్, గత సంవత్సరం T20 ప్రపంచ కప్ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన వైట్-బాల్ సిరీస్‌లో భారత జట్టుకు తాత్కాలిక ప్రధాన కోచ్‌గా పనిచేశారు.

world cup 2023 : వరల్డ్ కప్ పాలిటిక్స్... టీమిండియా ఓటమికి ఇందిరా గాంధే కారణం : అసోం సీఎం నయా ట్విస్ట్

"లక్ష్మణ్ ఈ కొత్త బాధ్యతలపై తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. ప్రపంచ కప్ సమయంలో ఈ విషయంలో బీసీసీఐ టాప్ బాస్‌లను కలవడానికి లక్ష్మణ్ అహ్మదాబాద్‌కు వెళ్లాడు. అతను టీమ్ ఇండియా కోచ్‌గా ఒప్పందంపై సంతకం చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా టీం ఇండియాతో కలిసి ప్రయాణం చేస్తాడు. రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనలో భారత జట్టు పూర్తి స్థాయి ప్రధాన కోచ్‌గా మొదటి సారి అవ్వబోతున్నారు" అని BCCIలోని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్టుగా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించింది. 

దక్షిణాఫ్రికాతో తొలి టీ20 డిసెంబర్ 10న జరగాల్సి ఉండగా, డిసెంబర్ 4న భారత జట్టు బయలుదేరే అవకాశం ఉంది. 2021 నవంబర్‌లో ద్రవిడ్‌ను టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా నియమిస్తూ. రెండేళ్ల కాంట్రాక్ట్‌ కుదిరింది. భారత్‌లో జరిగిన ప్రపంచకప్‌తో ఈ కాంట్రాక్ట్ ముగిసింది. దీని తరువాత "తాను పూర్తి స్థాయి కోచ్‌గా కొనసాగడానికి ఇష్టపడటం లేదని ద్రవిడ్ బీసీసీఐకి తెలియజేసాడు. దాదాపు 20 సంవత్సరాలుగా, ఒక ఆటగాడిగా భారత జట్టుతో కలిసి ప్రయాణించాడు. గత రెండు సంవత్సరాలుగా కోచ్ గా ఉన్నాడు. అదే పాత్రను, అదే చిన్నతనాన్ని అనుభవించకూడదనుకుంటున్నాడు. 

ఎన్ సీఏలో ప్రధాన పాత్రతో బాగానే ఉన్నాడు. దీనివల్ల అతని స్వస్థలమైన బెంగళూరులో ఉండడానికి వీలవుతుంది. అయితే, ద్రవిడ్ జట్టుకు అప్పుడప్పుడు కోచ్‌గా ఉంటాడు. కానీ, పూర్తి సమయం కోచ్‌గా ఉండడు.. అని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ద్రవిడ్ ఇప్పటికే తన భవిష్యత్తు కార్యాచరణకు ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. రెండేళ్ల కాంట్రాక్ట్ కోసం ఐపీఎల్ జట్టుతో చర్చలు జరుపుతున్నాడని దీని సారాంశం. ప్రపంచకప్‌తో కాంట్రాక్టులు ముగిసిన భారత జట్టులోని ఇతర సపోర్టు స్టాఫ్‌లు.. తిరిగి కొనసాగుతారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. భారత బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్‌గా పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్‌గా టి దిలీప్ ఉన్నారు.

"వారు కొనసాగవచ్చు లేదా ఇతర కోచ్‌ల మాదిరిగానే లక్ష్మణ్ కూడా తన స్వంత వారిని సపోర్టు స్టాఫ్‌లో చేర్చుకోవాలనుకోవచ్చు" అని టీఓఐ రాసింది. ద్రవిడ్ కోచింగ్ లో భారత జట్టు రెండేళ్ల పాటు ఆస్ట్రేలియాలో జరిగిన T20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్‌లో భారత్ ఓడిపోవడం, ఆసియా కప్‌లో విజయం సాధించడం, ODI ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం, ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్‌లపై స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లు, బంగ్లాదేశ్‌లో ఎవే సిరీస్‌లను గెలుచుకోవడం వంటివి చూసింది. ఇంకా..  వెస్టిండీస్. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంకపై కూడా స్వదేశంలో T20I సిరీస్ విజయాలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో టెస్టులు, వన్డే సిరీస్‌లు, ఇంగ్లండ్‌లో జరిగిన నిర్ణయాత్మక ఐదో టెస్టులో టీమిండియా ఓడిపోయింది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios