VIVO  To Sponsor Spanish Football League Laliga: ఇటీవలే ఐపీఎల్ స్పాన్సరింగ్ నుంచి పలు నాటకీయ పరిణామాల మధ్య తప్పుకున్న చైనీస్ మొబైల్స్ తయారీ సంస్థ వివో జాక్పాట్ కొట్టింది.  

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారు సంస్థ వివో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఎదురుదెబ్బ తగిలినా దానికి మంచే జరిగింది. ఐపీఎల్ నుంచి తప్పుకున్నా అది మరో భారీ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. యూరప్ ను ఊపేస్తున్న ప్రముఖ ఫుట్బాల్ లీగ్.. ‘లా లిగా’ కు వివో స్పాన్సర్ షిప్ చేయనుంది. ఈ మేరకు లా లిగాతో వివో ఒప్పందం కుదుర్చుకుంది. 2024-25 సీజన్ దాకా ఈ లీగ్ కు వివో నే స్పాన్సర్ గా వ్యవహరించనుండటం గమనార్హం. లా లిగాతో పాటు ఫిఫా వరల్డ్ కప్, మెన్స్ యూరో 2024 లకు కూడా వివో నే స్పాన్సర్షిప్ హక్కులను దక్కించుకుంది. 

2016 నుంచి ఐపీఎల్ కు టైటిల్ స్పాన్సర్ గా వ్యవహరించిన వివో.. ఈ సీజన్ కు ముందు నాటకీయ పరిణామాల మధ్య లీగ్ నుంచి తప్పుకున్నది. 2018-22 మధ్య నాలుగేండ్ల కాలానికి గాను రూ. 2,200 కోట్లతో ఐపీఎల్ స్పాన్సర్ షిప్ హక్కులను దక్కించుకున్నది వివో. కానీ 2020లో భారత్-చైనా మధ్య గల్వాన్ లోయలో ఏర్పడిన వివాదాలతో ఆ సంస్థతో పాటు బీసీసీఐకి చిక్కులు ఎదురయ్యాయి. 

Scroll to load tweet…

2020 లో ఐపీఎల్ స్పాన్సరింగ్ ను డ్రీమ్ 11 ఐపీఎల్ కు అప్పగించినా.. తిరిగి 2021 లో మళ్లీ వివో నే ఆ బాధ్యతలు స్వీకరించింది. కానీ దీనిపై బీసీసీఐ మీద తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చైనా సంస్థను స్పాన్సర్షిప్ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా డిమాండ్లు వినిపించాయి. దీంతో లెక్క ప్రకారం 2022 వరకు వివో తో స్పాన్సరింగ్ హక్కులు ఉన్నా ఆరు నెలల ముందుగానే అది వైదొలిగింది. ఆ స్థానంలో టాటా వచ్చి చేరిన విషయం తెలిసిందే. 

కాగా ముగింపు కొత్త ప్రారంభానినికి నాంది అన్నట్టుగా.. ఐపీఎల్ నుంచి తప్పుకున్నా వివో మాత్రం అంతకుమించిన డీల్ పట్టింది. ఐపీఎల్ తో పోలిస్తే లా లిగా చాలా పెద్దది. యూరప్ లో ఫుట్ బాల్ కు ఉండే ఆదరణే వేరు. స్పెయిన్, పోర్చుగల్ తో పాటు ఇతర యూరోపియన్ దేశాలలో ఈ లీగ్ కు భీభత్సమైన క్రేజ్ ఉంది. అయితే ఈ ఒప్పందం విలువ ఎంతనేది మాత్రం అటు లీగ్ నిర్వాహకులు గానీ ఇటు వివోో గానీ ఇంతవరకూ వెల్లడించలేదు.

Scroll to load tweet…

అయితే లా లిగా కు స్మార్ట్ ఫోన్ కేటగిరిలో స్పాన్సర్షిప్ లేదు. 2020 ఆగస్టు వరకు ఎల్జీ సంస్థ ఆ బాధ్యతలను చూసింది. కానీ తర్వాత అది తప్పుకుంది. ఇప్పుడు ఆ స్థానాన్ని వివో భర్తీ చేయనుంది. లా లిగాతో పాటు ఫిఫా వరల్డ్ కప్, మెన్స్ యూరో 2024 లకు కూడా స్పాన్సర్ గా ఉండనున్నట్టు సమాచారం. వివో గతంలో 2018, 2020 ఫిఫా, యూరో టోర్నమెంట్లకు స్పాన్సర్ గా వ్యవహరించింది.