Asianet News TeluguAsianet News Telugu

వివో అవుట్: ఐపీఎల్ స్పాన్సర్షిప్ కోసం పోటీ పడుతున్న కంపెనీలు ఇవే...

ఇండియన్‌ ప్రీమి యర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు వివో అధికారికంగా దూరమవడంతో బీసీసీఐ మరో స్పాన్సర్‌ కోసం త్వరలోనే టెండ ర్లను పిలవనుంది. ఈ నేపథ్యంలో బైజూస్‌, జియో, అమెజాన్‌, అన్‌అకాడమీ, డ్రీమ్‌ 11, మైసర్కిల్‌ 11 తదితర కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 

Vivo Moves Out Of IPL, Companies For Bagging The Title Sponsorship, Jio, Byjus, Amazon Seem To Be The Front Runners
Author
Mumbai, First Published Aug 8, 2020, 1:50 PM IST

ఇండియన్‌ ప్రీమి యర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌కు వివో అధికారికంగా దూరమవడంతో బీసీసీఐ మరో స్పాన్సర్‌ కోసం త్వరలోనే టెండ ర్లను పిలవనుంది. ఈ నేపథ్యంలో బైజూస్‌, జియో, అమెజాన్‌, అన్‌అకాడమీ, డ్రీమ్‌ 11, మైసర్కిల్‌ 11 తదితర కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. 

'బైజూస్‌' సంస్థ ఇప్పటికే భారత క్రికెట్‌ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఐపీఎల్‌లో సగం జట్లకు అసోసియేట్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న 'జియో' సైతం ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. 

దసరా(అక్టోబర్‌), దీపావళి(నవంబర్‌) నెలల్లో భారత్‌లో ఫెస్టివల్‌ సీజన్‌ కావడంతో అత్యంత ప్రజాదరణ ఉన్న ఐపీఎల్‌తో అనుబంధం పెంచుకునేందుకు ఇది సరైన సమయమని 'అమెజాన్‌' కూడా భావిస్తున్నది. 

ఫ్లిప్‌కార్ట్‌తో గట్టిపోటీ ఎదురవుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో మరింత బలపడాలని అమెజాన్‌ యోచిస్తోంది. మరోవైపు స్పాన్సర్‌షిప్‌ హక్కుల కోసం మరో రెండు కంపెనీలు అన్‌అకాడమీ, మైసర్కిల్‌11, డ్రీమ్‌ 11 పోటీపడబోతున్నట్టు తెలుస్తున్నది.

ఇకపోతే.... గాల్వాన్ లోయలో చైనా దురాగతానికి వ్యతిరేకంగా, చైనా దుష్టనీతిని నిరసిస్తూ చైనా వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకున్న విషయం తెలిసిందే. దీనితో సోషల్ మీడియాలో ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వివో స్వచ్చంధంగా ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ గా తప్పుకుంది. 

చైనాకు చెందిన యాప్ లపై ప్రభుత్వం నిషేధం విధించుకుంటూ పోతుంటే.... బీసీసీఐ మాత్రం వివోనే కొనసాగించడానికి నిశ్చయించుకుంది. ఈ నేపథ్యంలోనే తీవ్ర దుమారం చెలరేగడం, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇది మరింతగా ఎక్కువవడంతో వివో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలియవస్తుంది.

ఇటీవల భారత ప్రభుత్వం చైనా దేశానికి సంబంధించి 59 యాప్లను నిషేధించిన సంగతి కూడా విదితమే. ఇలాంటి నేపథ్యంలో ఐపీఎల్‌ స్పాన్సర్ గా వివో సంస్థ స్వచ్ఛందంగా స్పాన్సర్ షిప్ నుండి తప్పుకోవడానికి సిద్ధమైంది. 

2018లో హక్కుల కోసం వివో 2,199 కోట్లను బీసీసీఐకి చెల్లించింది. అంటే ఒక్కో సంవత్సరానికి 440 కోట్లను సరాసరిగా చెల్లిస్తుంది. బీసీసీఐకి ఏకంగా ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ వంటి సంస్థల నుంచే బెదిరింపులు ఎదురయ్యింది నేపథ్యంలో వివో తప్పుకోవడమే కరెక్ట్ అని భావించింది.

Follow Us:
Download App:
  • android
  • ios