పాకిస్థాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఇటీవల ఐక్యరాజ్యసమితి వేదికన వివాదాస్పద ప్రసంగం  చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత్ ను టార్గెట్ గా చేసుకుని తన కడుపులోని విషాన్నంతా అంతర్జాతీయ సమాజం ముందు కక్కాడు. దీంతో అప్పటివరకు ఆసియా దేశాలకే తెలిసిన పాకిస్థాన్ వక్రబుద్ది ప్రపంచం మొత్తానికి అర్థమయ్యింది. దీంతో ఆ దేశాన్ని...శాంతివనంలాంటి యూఎన్‌ఏలో యుద్దంచేయడానికి సిద్దమేనన్న ఆ దేశ ప్రధానిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ క్రమంలోనే ఇటీవల ఓ అంతర్జాతీయ టీవి ఛానల్ ఇమ్రాన్ ను ఇంటర్వ్యూ చేసింది. అందులో చైనాపై పొగడ్తల వర్షం కురిపిస్తూ మిగతా దేశాలపై విమర్శలు గుప్పించిన ఇమ్రాన్ కు యాంకర్  లైవ్ లోనే చీవాట్లుపెట్టాడు. నువ్వసలు  ఓ దేశ ప్రధానిలా మాట్లాడటంలేదంటూ ఇమ్రాన్ మాటలను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. 

దీనిపై తాజాగా టీమిండియా డాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్ స్పందించాడు. ''  కొద్ది రోజుల క్రితం ఐరాసలో జరిగిన దారుణమైన ప్రసంగం తరువాత ఈ వ్యక్తి(ఇమ్రాన్) తనను తాను అవమానించుకోడానికి కొత్త మార్గాలను కనుగొంటున్నాడు. దాంట్లో భాగంగానే ఆ యాంకర్ తో కూడా చీవాట్లు తిన్నాడు.'' అంటూ సెహ్వాగ్ పాక్ ప్రధానికి యాంకర్ చీవాట్లుసపెట్టిన వీడియోను జతచేస్తూ ట్వీట్ చేశాడు. 

ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుండగా సెహ్వాగ్ ట్వీట్ తర్వాత మరింత ఎక్కువయ్యింది. ఈ ట్వీట్ పై పులువురు మాజీ క్రికెటర్లతో పాటు అభిమానులు తెగ కామెంట్ చేస్తున్నారు.ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ పై క్రికెటర్లు మహ్మద్‌ షమీ, హర్భజన్‌ సింగ్‌,  గౌతమ్‌ గంభీర్‌ లు విరుచుకుపడగా తాజాగా సెహ్వాగ్ అంతకంటే ఘాటుగా స్పందించాడు.