అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుని ఆరేళ్లు అవుతున్నా, తన బ్యాటింగ్‌లో ఏ మాత్రం పదును, దూకుడు తగ్గలేదని నిరూపించాడు వీరేంద్ర సెహ్వాగ్. 42 ఏళ్ల ఈ ఇండియన్ మాజీ ఓపెనర్, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో మరోసారి పాత వీరూని గుర్తుకు తెచ్చాడు.

మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ లెజెండ్స్, 19.4 ఓవర్లలలో 109 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నజీముద్దీన్ 49 పరుగులు చేయగా, భారత బౌలర్లలో వినయ్ కుమార్, ఓజా, యువరాజ్ సింగ్ రెండేసి వికెట్లు తీశారు. 110 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఇండియా లెజెండ్స్, 10.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఈజీగా చేధించింది.

మొదటి రెండు బంతులను బౌండరీకి తరలించిన వీరేంద్ర సెహ్వాగ్, సిక్సర్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన వీరూ, 35 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ 26 బంతుల్లో 5 ఫోర్లతో 33 పరుగులు చేశాడు. ఈ ఇద్దరూ మొదటి వికెట్‌కి అజేయంగా 114 పరుగులు జోడించి, ఇండియా లెజెండ్స్‌కి ఘన విజయాన్ని అందించారు.