Asianet News TeluguAsianet News Telugu

కళ్లలో కోటి కలలు... నరనరాన సెంచరీలు...: కోహ్లీకి సెహ్వాగ్ సరికొత్తగా భర్త్ డే విషెన్ 

పరుగుల దాహం ఎన్నటికీ తీరదన్నట్లుగా వుంటుంది అతడి బ్యాటింగ్...  అతడి నరనరాన హిమోగ్లోబిన్ తరహాలో సెంచరీలు పరుగెడుతుంటాయి అంటూ విరాట్ కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తుతూ భర్త్ డే విషెస్ తెలిపారు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. .

Virendra Sehwag Birthday Wishes to Virat Kohli AKP
Author
First Published Nov 5, 2023, 1:53 PM IST | Last Updated Nov 5, 2023, 2:02 PM IST

హైదరాబాద్ : విరాట్ కోహ్లీ... ఈ పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లో గట్టిగా వినిపిస్తోంది. అభిమానులు అతడిని ముద్దుగా రన్ మెషిన్ అని పిలుచుకుంటారంటేనే ఆ పరుగుల ప్రవాహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డులనే ఒక్కోటిగా బద్దలుగొడుతున్నాడంటేనే అతడు కేవలం అద్భుత ఆటగాడే కాదు పోటుగాడని అర్థమవుతుంది. ఇలా భారత క్రికెట్ లో కింగ్ లా వెలుగుతున్న కోహ్లీ నేటితో 35 వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో అతడికి టీమిండియా క్రికెటర్లు, మాజీ ఆటగాళ్ళు, అభిమానులు సరికొత్తగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. 

టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ''ఆ యువ ఆటగాడి కళ్లలో ఎన్నో కలలు... నిజాయితీతో కూడిన హార్డ్ వర్క్, ఆటపట్ల ప్యాషన్... వీటన్నింటికంటే ముఖ్యంగా అద్భుతమైన టాలెంట్ అతడిని ఇక్కడివరకు తీసుకువచ్చాయి. పరుగుల దాహం ఎన్నటికీ తీరదన్నట్లుగా వుంటుంది అతడి బ్యాటింగ్...  అతడి నరనరాన హిమోగ్లోబిన్ తరహాలో సెంచరీలు పరుగెడుతుంటాయి. కెరీర్ లో ఎత్తుపల్లాలు సహజమే... కానీ అతడి ఇంటెన్సిటి ఎప్పుడూ ఒకేలా వుంటుంది. హ్యాపీ భర్త్ డే విరాట్ కోహ్లీ'' అంటూ సెహ్వాగ్ ఎక్స్(ట్విట్టర్) వేదికన స్పందించారు. 

 

ఇలా కోహ్లీని ఆకాశానికి ఎత్తేలా పొగిడుతూ అతడితో కలిసివున్న ఫోటోను పోస్ట్ చేసాడు సెహ్వాగ్. క్రీజులో కోహ్లీతో కలిసి పరుగు తీస్తున్న అద్భుతమైన ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు సెహ్వాగ్. ఈ ఇద్దరి ఫోటోకు అభిమానులు ఫిదా అవుతున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios