Asianet News TeluguAsianet News Telugu

భజరంగబలి... కరోనా నడ్డి విరగ్గొట్టాలి: వీరేంద్ర సెహ్వాగ్, వీడియో వైరల్

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భారత మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మరోసారి టిక్ టాక్ లో ప్రత్యక్షమయ్యారు. హనుమాన్ చాలీసా చదువుతూ కరోనా నడ్డి విరగ్గొట్టాలని ఆ దేవుడిని ప్రార్థించడంతోపాటు అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలిపాడు. 

Virender sehwag Recites Hanuman Chalisa and appeals to Lord Hanuma to break the bones of corona virus
Author
New Delhi, First Published Apr 11, 2020, 7:38 AM IST

ఈ మధ్య సెలెబ్రిటీలు అంతా టిక్ టాక్ బాట పడుతున్నారు. సినిమా హీరోల నుంచి మొదలు క్రికెట్ స్టార్స్ వరకు అందరూ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫారం మీద ప్రత్యక్షమవుతున్నారు. కొన్ని రోజుల కింద భారత బౌలర్ షమీ కూడా ఈ టిక్ టాక్ లైవ్ లో అభిమానులతో ముచ్చటించిన విషయం తెలిసిందే. 

ఇక తాజాగా హనుమాన్ జయంతిని పురస్కరించుకొని భారత మాజీ ఆటగాడు, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా మరోసారి టిక్ టాక్ లో ప్రత్యక్షమయ్యారు. హనుమాన్ చాలీసా చదువుతూ కరోనా నడ్డి విరగ్గొట్టాలని ఆ దేవుడిని ప్రార్థించడంతోపాటు అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు తెలిపాడు. 

@virendersehwag

##hanumanjayanti

♬ Shri Hanuman Chaleesa / Gate Of Sweet Nectar - Krishna Das

కరోనా మహమ్మారి కరాళ నృత్యానికి బహుశా ఆ భగవంతుడే అడ్డుకట్టవేయలేమో! భారత దేశంలో కూడా ఈ వైరస్ ఇంకా పంజా విసురుతూనే ఉందేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6412కి చేరుకొన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. 24 గంటల్లో కొత్తగా 678 కొత్త కేసులు నమోదైనట్టుగా చెప్పారు. ఇప్పటివరకు ఈ వ్యాధితో 199 మంది మృతి చెందారన్నారు.

శుక్రవారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న ఒక్క రోజునే 16,002 మందిని పరీక్షిస్తే 0.2 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీని కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసినట్టుగా ఆయన తెలిపారు. దేశంలో ఉన్న 20,473 మంది విదేశీయులను వారి దేశాలకు పంపామన్నారు.

Also read:కరోనా ఎఫెక్ట్: ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ జరుపుకొన్న జంట
హైడ్రాక్సీ క్లోరోక్వీన్ కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున డిమాండ్ ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈ మందు కావాలని చాలా దేశాలు భారత్ ను కోరుతున్నట్టుగా లవ్ అగర్వాల్ చెప్పారు.

మన దేశంలో  హైడ్రాక్సీ క్లోరోక్విన్  సరిపడు నిల్వలు ఉన్నాయన్నారు. 38 వేల క్యాంపుల్లో 14.3 లక్షల మందికి షెల్టర్ ఇచ్చామన్నారు.రూ. 15 వేల కోట్లతో ప్రత్యేక కోవిడ్ ప్యాకేజీని రూపొందించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపారు. ఈ ప్యాకేజీ ద్వారా కరోనా రోగులకు సేవలు అందిస్తున్న ఆసుపత్రుల్లో సౌకర్యాలను కల్పిస్తామన్నారు. 

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రధాని మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం నాడు వీడియో కాన్పరెన్స్ నిర్వహించనున్నారు.ది. 

Follow Us:
Download App:
  • android
  • ios