Asianet News TeluguAsianet News Telugu

ఈ పుస్తకం కోహ్లీని మార్చేసిందట!

తెలుగులో ఒకయోగి ఆత్మకథ అనే పేరుతో ఈ పుస్తకం అనువాదం అయింది. ఆత్మ సాక్షాత్కారం కోసం తపించే శిష్యులకు వేదకాలం నుంచే అందుబాటులో ఉన్న విశిష్టమైన క్రియాయోగ గురించి పరమహంస యోగానంద ఈ పుస్తకంలో వివరించారు. 

Virat Kohli wants you to read this book that has changed his life
Author
Hyderabad, First Published Aug 12, 2020, 11:34 AM IST

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కి యూత్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు విదేశాల్లోనూ అభిమానులు ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే..  కోహ్లీ ఓ పుస్తకం గురించి తన అభిమానులకు వివరించాడు. తనలో ఈ పుసక్తం చదివిన తర్వాత చాలా మార్పు వచ్చిందని ఆయన చెప్పడం విశేషం.


తనను అత్యంత ప్రభావితం చేసేన పుస్తకం ఏదో బయటపెట్టేశారు టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ యోగి అనే పుస్తకం తనపై బాగా ప్రభావితం చూపిందని కోహ్లీ చెప్పారు. తెలుగులో ఒకయోగి ఆత్మకథ అనే పేరుతో ఈ పుస్తకం అనువాదం అయింది. ఆత్మ సాక్షాత్కారం కోసం తపించే శిష్యులకు వేదకాలం నుంచే అందుబాటులో ఉన్న విశిష్టమైన క్రియాయోగ గురించి పరమహంస యోగానంద ఈ పుస్తకంలో వివరించారు. 

భారతదేశంలోనే పుట్టి ఇక్కడి సాధువులను, స్వాములను, గురువులను కలిసి సంపాదించిన జ్ఞానాన్ని ప్రపంచానికి బోధించి లక్షలాది మందిని ఆధ్యాత్మిక మార్గంలో ప్రకాశింప చేసిన పరమహంస యోగానంద జీవిత చరిత్రయే ఈ పుస్తకం. అనేక సంవత్సరాలు అమెరికాలోనే ఉండి వారిని కూడా ఆధ్యాత్మిక మార్గంలో ఉద్ధరింప చేసిన యోగానంద జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన ఆత్మకథను చదువుతూ నేటికీ లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా ప్రభావితులవుతున్నారు. సరిగ్గా ఈ కోవలోకే వచ్చిన కోహ్లీ అభిమానులకు తన ఫ్యావరెట్ బుక్‌ను ట్విటర్ ద్వారా వెల్లడిస్తూ ఫొటోను కూడా జత చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios