టీమిండియా కెప్టెన్ విరాట్  కోహ్లీ డుప్లెసిస్ లాంటి ఆటగాడు  ఎప్పుడూ తన జట్టులో వుండాలని  కోరుకుంటానని అన్నాడు. అలాగే బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ను అవకాశం ఇస్తానన్నాడు. ఇలా వారిద్దరు జట్టులో వుంటే తప్పకుండా అదో బలమైన జట్టుగా మారుతుందని  కోహ్లీ అభిప్రాయపడ్డాడు. 

ఐసిసి వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ జట్లన్నీ  ఇంగ్లాండ్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం అన్ని జట్ల కెప్టెన్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐసిసి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. కెప్టెన్లందరితో ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించిన తర్వాత వారితో సరదాగా మాట్లాడించే ప్రయత్నం చేశారు. 

ఈ సందర్భంగా మీరు కెప్టెన్లుగా వున్న జట్లలో ఏ ఆటగాడు తప్పకుండా వుండాలని కోరుకకుంటారని ప్రశ్నించగా... కోహ్లీ మొదట డివిలియర్స్ వుండాలని అనుకుంటానని తెలిపాడు. అయితే అతడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు కాబట్టి డుప్లెసిస్ కు అవకాశమిస్తానని అన్నాడు. అతడు ఆటతీరు అద్భుతంగా వుంటుందని...అందుకే అతడంటే తనకెంతో ఇష్టమని కోహ్లీ పేర్కొన్నాడు. బౌలర్లలో అయితే బుమ్రా కంటే బెస్ట్ చాయిస్ నాకెక్కడి కనిపించడం లేదని అన్నాడు. కాబట్టి అతడు తప్పకుండా మా జట్టులో వుండాలని కోరుకుంటానని కోహ్లీ వెల్లడించాడు. 

అయితే ఇదే ప్రశ్నకు అందరు  కెప్టెన్లు వివిధ ఆటగాళ్లను ఎంచుకున్నారు. బంగ్లాదేశ్‌ కెప్టెన్ మొర్తాజా విరాట్ కోహ్లీ తమ జట్టులో ఉండాలని కోరుకుంటానన్నాడు. ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ రబడను, పాకిస్తాన్‌ సారథి  సర్ఫరాజ్‌ బట్లర్‌ను, శ్రీలంక సారథి కరుణరత్నే ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్‌ స్టోక్స్‌ను కోరుకున్నారు.  ఇంగ్లండ్‌ కెప్టెన్ మోర్గాన్ మాత్రం తామిప్పుడున్న జట్టే అద్భుతంగా వుందని తమకు ఇంకెవ్వరు ఆటగాళ్ల అవసరం లేదని సమాధానమిచ్చాడు. 

 ప్రపంచ కప్ వార్తలు  

2019 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల.. జూన్ 16న పాక్‌తో భారత్ ఢీ