ఆసియాకప్ 2023: వాటర్ బాయ్ గా కోహ్లీ ఫన్నీమూమెంట్స్.. వీడియో వైరల్..!
మ్యాచ్ లేకపోవడంతో వాటర్ బాయ్ గా మారిపోయాడు. వాటర్ బాయ్ గా మారినా కూడా సందడి చేయడం మాత్రం ఆపలేదు. మామూలుగానే వీలైనంత వరకు కోహ్లీ ఇతరులను ఎంటర్ ట్రైన్ చేయడంలో ముందుంటాడు
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గురించి స్పెషల్ గా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన పరుగుల మెషిన్. మైదానంలోకి అడుగుపెట్టాడంటే పరుగుల వరద కురిపించకుండా ఉండడు. ఇక, ఆసియాకప్ 2023లో అయితే చెలరేగిపోయి ఆడాడు. ముఖ్యంగా పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో విజృంభించాడు. సెంచరీలు చేశాడు. అయితే, శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ కి రెస్ట్ ఇచ్చారు.
మ్యాచ్ లేకపోవడంతో వాటర్ బాయ్ గా మారిపోయాడు. వాటర్ బాయ్ గా మారినా కూడా సందడి చేయడం మాత్రం ఆపలేదు. మామూలుగానే వీలైనంత వరకు కోహ్లీ ఇతరులను ఎంటర్ ట్రైన్ చేయడంలో ముందుంటాడు. ఇక, టీమ్ కి వాటర్ బాయ్ కి మారినప్పుడు, మైదానంలోకి వాటర్ బాటిల్స్ పట్టుకొని పరుగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే, ఆ సమయంలో అతను నడిచే విధానం అందరినీ ఆకట్టుకుంది. చాలా ఫన్నీగా నడిచాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక, శుక్రవారం జరిగిన మ్యాచ్ విషయానికి వస్తే, ఆసియా కప్ 2023 టోర్నీలో టీమిండియా తొలి పరాజయాన్ని అందుకుంది. పాకిస్తాన్, శ్రీలంక చేతుల్లో చిత్తుగా ఓడిన బంగ్లాదేశ్, భారత జట్టుపై 6 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం అందుకుంది. నామమాత్రపు మ్యాచ్‌లో 5 మార్పులతో బరిలో దిగిన భారత జట్టు, ఆఖరి ఓవర్ దాకా పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది.
ఆసియా కప్‌లో భారత్‌పై బంగ్లాదేశ్‌కి 11 ఏళ్ల తర్వాత వచ్చిన తొలి విజయం ఇదే. రోహిత్ శర్మ కెప్టెన్సీలో వన్డే ఆసియా కప్‌లో టీమిండియా ఎదుర్కొన్న మొదటి ఓటమి కూడా ఇదే. 266 పరుగుల లక్ష్యఛేదనలో టీమిండియా 49.5 ఓవర్లలో 259 పరుగులకి ఆలౌట్ అయ్యింది.
భారత జట్టు విజయానికి ఆఖరి 2 ఓవర్లలో 17 పరుగులు కావాల్సి వచ్చాయి. ముస్తాఫిజుర్ రెహ్మాన్ వేసిన 49వ ఓవర్ తొలి బంతికి శార్దూల్ ఠాకూర్ అవుట్ అయ్యాడు. షమీ తొలి బంతికి సింగిల్ తీసి అక్షర్ పటేల్‌కి స్ట్రైయిక్ ఇచ్చాడు. ఫోర్ బాదిన అక్షర్ పటేల్, ఆ తర్వాతి బంతికి భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు..
34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసిన అక్షర్ పటేల్ అవుట్ అయ్యేసరికి టీమిండియా విజయానికి 8 బంతుల్లో 12 పరుగులు కావాలి. ప్రసిద్ధ్ కృష్ట తొలి రెండు బంతుల్లో పరుగులు రాబట్టలేకపోయాడు. చివరి ఓవర్‌లో 12 పరుగులు అవసరం అయ్యాయి.
మహ్మద్ షమీ, ఆఖరి 3 బంతుల్లో పరుగులేమీ రాబట్టలేకపోయాడు. నాలుగో బంతికి షమీ ఫోర్ రాబట్టడంతో చివరి 2 బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. ఆ తర్వాతి బంతికి రెండో పరుగుకి ప్రయత్నించిన మహ్మద్ షమీ రనౌట్ కావడంతో భారత ఇన్నింగ్స్ 259 పరుగుల వద్ద ముగిసింది.