కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా క్రీడా ప్రపంచమంతా ఎక్కడికక్కడ స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. మాములగా అయితే.. ఈ టైంలో ఐపీఎల్ తో క్రికెటర్లంతా సందడి చేసేవారు. అభిమానులు కూడా టీవీలకు అతుక్కుపోయి  చూసేవారు.

కానీ కరోనా కారణంగా అంతా తారుమారు అయిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరికి తోచినట్లుగా వారు టైంపాస్ చేస్తున్నారు.

తాజాగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిట్నెస్ మీద దృష్టి పెట్టాడు. లాక్ డౌన్ ని ఈ నెల 31వరకు పొడిగించగా.. ప్రేక్షకులు లేకుండా క్రీడలకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలోనే క్రికెట్ సందడి మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే.. ఐపీఎల్ సందడి మొదలైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. అందుకే ముందస్తుగా కోహ్లీ తన కసరత్తులు మొదలుపెట్టారు.

బరువులు ఎత్తుతూ కసరత్తులు చేశాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఆ వీడియోకి దక్షిణాఫ్రికా క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. ఆశ్చర్యపోతున్న ఎమోజీ, స్టాంగ్ అని సూచించే ఎమోజీలు పెట్టి రిప్లై ఇచ్చాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Earn it. Don't demand it.

A post shared by Virat Kohli (@virat.kohli) on May 19, 2020 at 8:36am PDT

 

వీరిద్దరూ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం కలిసి ఆడిన సంగతి తెలిసిందే. ఈ జట్టుకి కోహ్లీ కెప్టెన్ కావడం గమనార్హం. లాక్ డౌన్ పీరియడ్ లో వీరిద్దరూ కలిసి ఇన్ స్టాగ్రామ్ లో ఓ రోజు సందడి కూడా చేశారు. డివిలర్స్అడిగిన ప్రశ్నలకు కోహ్లీ సమాధానాలు ఇచ్చాడు.