స్కాట్లాండ్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఒమన్‌ని 8 వికెట్ల తేడాతో గురువారం రాత్రి ఓడించిన స్కాట్లాండ్.. సూపర్-12లోకి దూసుకొచ్చింది. 

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat kohli) కి స్కాట్లాండ్ స్పిన్నర్ మార్క్ వాట్ వార్నింగ్ ఇచ్చాడు. పసికూన స్కాట్లాండ్ తొలిసారి టీ20 వరల్డ్‌కప్‌లో ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఒమన్‌ని 8 వికెట్ల తేడాతో గురువారం రాత్రి ఓడించిన స్కాట్లాండ్.. సూపర్-12లోకి దూసుకొచ్చింది. గ్రూప్-బిలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన స్కాట్లాండ్ పాయింట్ల పట్టికలోనూ టాప్‌లో నిలవగా.. రెండు విజయాలతో బంగ్లాదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

Also Read: అది కోహ్లీ సొంత నిర్ణయం.. నేనే షాక్ అయ్యాను.. సౌరవ్ గంగూలీ..!

చివరి గ్రూప్ B గేమ్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన తర్వాత, 5.41 ఎకానమీ రేట్‌తో మూడు గేమ్‌లలో మూడు వికెట్లు తీసిన ఎడమచేతి వాటం స్పిన్నర్ మార్క్ వాట్... విరాట్ కోహ్లీ కి వార్నింగ్ ఇచ్చాడు. కోహ్లీ కోసం తన వద్ద కొన్ని ప్లాన్స్ ఉన్నాయి అని మార్క్ చెప్పాడు.

Also read: T20 worldcup 2021: వెంకటేశ్ అయ్యర్‌తో సహా ఆ నలుగురు స్వదేశానికి... టీమిండియాకి నెట్‌ బౌలర్ల కొరత...

"విరాట్ కోసం నాకు చాలా ప్రణాళికలు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను వాటిని నిశ్శబ్దంగా ఉంచబోతున్నాను, కానీ అతను ఆందోళన చెందాలని నేను అనుకుంటున్నాను" అని వాట్ ఐసిసి ద్వారా పేర్కొన్నాడు.

సూపర్ 12 రౌండ్‌లో గ్రూప్ 2లో చేరిన స్కాట్లాండ్, భారత్‌తో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ ,నమీబియాతో తలపడనుంది. కోహ్లీ, కేన్ విలియమ్సన్, బాబర్ అజామ్ కి బౌలింగ్ చేయడం తనకు ఛాలెంజింగ్ గా ఉంటుందని మార్క్ చెప్పాడు.