Asianet News TeluguAsianet News Telugu

మీలాంటి ఆటగాళ్లు అరుదు : ఫెదరర్‌ రిటైర్మెంట్‌పై కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Virat Kohli - Roger Federer: రెండు దశాబ్దాలకు పైగా  టెన్నిస్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన  స్విస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించాడు. 

Virat Kohli shares Heartfelt Video For Roger Federer, Watch Here
Author
First Published Sep 29, 2022, 11:19 AM IST

ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ కు టీమిండియా  మాజీ సారథి విరాట్ కోహ్లీ  ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపాడు. అద్భుత కెరీర్ పూర్తి చేసుకుని ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన ఫెదరర్ వంటి ఆటగాడిని ప్రపంచంలో తాను మరెక్కడా చూడలేదని కోహ్లీ అన్నాడు. ఈ మేరకు   అసోసియేషన్   ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) షేర్ చేసిన ఓ వీడియో లో కోహ్లీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 

వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘హలో రోజర్.. మీ రిటైర్మెంట్ సందర్భంగా మీ గురించి మాట్లాడే అవకాశం దొరికినందుకు నేను గర్విస్తున్నాను. మీ అద్భుతమైన కెరీర్ లో మాకు లెక్కలేని ఆనందకర క్షణాలను, మరిచిపోలేని జ్ఞాపకాలను ఇచ్చారు.  

నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా  కలుసుకున్నది 2018 ఆస్ట్రేలియా ఓపెన్ లో.  నా జీవితంలో  ఆ క్షణాలను  నేనెప్పటికీ మరిచిపోలేను.  మీరు  ఆడుతున్నప్పుడు ప్రపంచంలోని టెన్నిస్ క్రీడాకారులే కాదు..  ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడైనా  మీకు మద్దతుగా ఉన్నాడు. ఇటువంటి మద్దతును నేనైతే ప్రపంచంలో ఏ క్రీడాకారుడికీ చూడలేదు. అది మీకు మీరు సొంతంగా సృష్టించుకున్నది కాదు. అది మీ గొప్పతనం. మీకు ఆ సామర్థ్యముంది. 

 

నీ ఆట సాటిలేనిది. నాకు  మీరు ఎల్లప్పుడూ స్పెషల్ ప్లేయర్.  టెన్నిస్ తర్వాత తదుపరి  జీవితంలో  టెన్నిస్ కోర్టులో చేసినంత ఆనందాన్ని గడపాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.  మీకు, మీ కుటుంబసభ్యులకు కూడా శుభాకాంక్షలు..’ అని  తెలిపాడు.  ఈ వీడియోను ఏటీపీ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. 

2018లోనే గాక 2015లో  కూడా  కోహ్లీ స్విస్ దిగ్గజాన్ని కలిశాడు. క్రికెట్ తర్వాత కోహ్లీ ఎక్కువ ఇష్టపడేది టెన్నిస్. క్రికెట్ షెడ్యూల్ ఏమీ లేకపోతే కోహ్లీ.. అదే సమయానికి ఏదైనా గ్రాండ్ స్లామ్ టోర్నీ జరిగితే తప్పకుండా అక్కడుంటాడు. గతంలో వింబూల్డన్, ఆస్ట్రేలియా  టోర్నీల సమయంలో కూడా కోహ్లీ.. ఓ టెన్నిస్ అభిమానిగా మ్యాచ్ లు చూశాడు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios