వీధికుక్కను ఒళ్లో కూర్చోబెట్టుకుని ముద్దు చేసిన విరాట్ కోహ్లీ... ఆరు నెలల క్రితం అనుష్క శర్మ పోస్ట్ చేసిన ఫోటోను, తిరిగి ఇన్‌స్టాలో పెట్టిన విరాట్ కోహ్లీ..
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంటున్నాడు. మొదటి మూడు టెస్టుల్లో కనీసం 50+ స్కోరు కూడా చేయలేకపోయిన విరాట్ కోహ్లీ, ఢిల్లీ టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది...
మూడో టెస్టు మూడు రోజుల్లోనే ముగియడంతో ప్లేయర్లకు రెండు రోజులు అదనంగా బ్రేక్ లభించింది. ఈ బ్రేక్ సమయంలో భార్య అనుష్క శర్మతో కలిసి ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్లాడు విరాట్ కోహ్లీ. ఉజ్జయినిలో రుద్రాక్ష మాల, నుదిటిన కుంకుమ బొట్టు ధరించి కనిపించాడు విరాట్ కోహ్లీ...
అయితే ఈ ఆలయానికి వెళ్లడానికి ముందు విరాట్ కోహ్లీ దంపతలు, గత ఏడాది చివర్లో రిషికేష్‌కి వెళ్లారు. బాబా నీమ్ కరోలీని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆశ్రమం నుంచి తిరిగి వచ్చిన తర్వాత వరుసగా వన్డేల్లో రెండు సెంచరీలు బాదాడు విరాట్ కోహ్లీ..
తాజాగా ఈ రిషికేష్ యాత్ర సమయంలో దిగిన ఓ క్యూట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు విరాట్ కోహ్లీ. ఈ ఫోటోలో విరాట్ కోహ్లీ ఓ వీధికుక్కను ఒళ్లో కూర్చుబెట్టుకుని, ప్రేమగా నిమురుతూ నవ్వుతున్నాడు. ఈ ఫోటోని అనుష్క శర్మ, ఆరు నెలల క్రితమే పోస్ట్ చేసింది. ఇదే కుక్క పిల్లను ప్రేమగా గుండెలకు హత్తుకుని, ఫోటోలకు ఫోజులు ఇచ్చింది అనుష్క శర్మ...
ఈ పాత ఫోటోను పోస్ట్ చేసిన విరాట్ కోహ్లీ, ఓం సింబల్‌ని కాప్షన్‌గా పెట్టాడు. ఉజ్జయిని నుంచి తిరిగి వచ్చిన అనుష్క శర్మ.. ‘నేను ఆ ఎత్తైన పర్వతాలను బాగా మిస్ అవుతున్నా. అవి కూడా నన్ను మిస్ అవుతున్నాయని అనుకుంటున్నా..’ అంటూ ఓ హోటల్ బాల్కనీలో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది అనుష్క శర్మ..
బాబా నీమ్ కరోలీని దర్శించుకున్న తర్వాత విరాట్ కోహ్లీ బ్యాటుతో అదరగొట్టాడు. మూడేళ్లుగా అందని 71వ సెంచరీని అందుకుని, వెంటవెంటనే 3 సెంచరీలు బాది 74 అంతర్జాతీయ సెంచరీలకు దూసుకెళ్లాడు. అయితే టెస్టుల్లో మాత్రం విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ ఇప్పటిదాకా విరాట్ కోహ్లీ బ్యాటు నుంచి ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ అయితే రాలేదు...
రోహిత్ శర్మ నాగ్‌పూర్ టెస్టులో సెంచరీ చేశాడు. ఛతేశ్వర్ పూజారా, ఇండోర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ ఆడిన రెండు టెస్టుల్లో పర్వాలేదనిపించాడు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటిదాకా తన రేంజ్ ముద్ర వేయలేకపోయాడు. కాబట్టి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో జరిగే నాలుగో టెస్టులో విరాట్ కోహ్లీ నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు అభిమానులు. మూడేళ్లుగా అందని టెస్టు సెంచరీని అందుకోవాలని కోరుకుంటున్నారు.
