విరాట్ కోహ్లీ బర్త్ డే గిఫ్ట్! 49వ సెంచరీతో సచిన్ రికార్డు సమం... సౌతాఫ్రికాపై టీమిండియా భారీ స్కోరు...

ICC World cup 2023 India vs South Africa: వన్డేల్లో 49వ సెంచరీతో సచిన్ టెండూల్కర్ రికార్డు సమం చేసిన విరాట్ కోహ్లీ... 77 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, 40 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. 

Virat Kohli scores 49th ODI Century, Equals Sachin Tendulkar record, ICC World cup 2023, India vs South Africa CRA

నేడు 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న విరాట్ కోహ్లీ, సెంచరీతో తనకు తాను అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. విరాట్ సెంచరీకి తోడు శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ, రోహిత్ శర్మ మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు, నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 326 పరుగుల భారీ స్కోరు చేసింది..

రోహిత్ శర్మ 24 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి మెరుపు ఆరంభం అందించాడు. దీంతో మొదటి 5 ఓవర్లలోనే 61 పరుగులు చేసింది భారత జట్టు. వన్డేల్లో టీమిండియాకి మొదటి 5 ఓవర్లలో ఇదే అత్యధిక స్కోరు..

రోహిత్ మరోసారి హాఫ్ సెంచరీ ముందు అవుట్ కాగా 24 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌ని  కేశవ్ మహరాజ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 93 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది భారత జట్టు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ కలిసి మూడో వికెట్‌కి 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు..

87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, లుంగి ఇంగిడి బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.  

సచిన్ టెండూల్కర్ తర్వాత సౌతాఫ్రికాపై 3 వేలకు పైగా పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ, స్వదేశంలో 6 వేల వన్డే పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు.  

అలాగే వన్డే వరల్డ్ కప్‌ టోర్నీల్లో 1500+ పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, కుమార సంగర్కర మాత్రమే 1500+ వన్డే వరల్డ్ కప్ పరుగులు చేశారు.. 

కెఎల్ రాహుల్ 17 బంతుల్లో 8 పరుగులు చేసి అవుట్ కాగా సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లో 5 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో క్రీజులో కుదురుకుపోయిన విరాట్ కోహ్లీ 119 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు..

వన్డేల్లో 49వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల రికార్డును సమం చేశాడు. సచిన్ టెండూల్కర్ 452 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 49 సెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ 277 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా విరాట్‌కి ఇది 79వ అంతర్జాతీయ సెంచరీ. 121 బంతుల్లో 10 ఫోర్లతో 101 పరుగులు చేసిన విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా 15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 29 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios