Asianet News TeluguAsianet News Telugu

టీమ్ కోసం హాఫ్ సెంచరీ వదులుకున్న విరాట్ కోహ్లీ... రక్తం కారినా బౌలర్లకు ఆదేశాలిచ్చిన రోహిత్ శర్మ...

49 పరుగుల వద్ద స్ట్రైయిక్ అవసరం లేదని దినేశ్ కార్తీక్‌కి సూచించిన విరాట్ కోహ్లీ... ముక్కు నుంచి రక్తం కారుతున్నా బౌలర్‌కి సూచనలు ఇచ్చిన కెప్టెన్ రోహిత్ శర్మ... 

Virat Kohli says no to half century, Rohit Sharma gives instructions to bowlers with bleeding nose
Author
First Published Oct 3, 2022, 1:26 PM IST

సౌతాఫ్రికా, ఇండియా మధ్య గౌహతిలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ క్రికెట్ ఫ్యాన్స్‌ని ఫుల్ మీల్స్‌ మజాని అందించింది. కుండపోతలా స్టేడియంలో కురిసిన బౌండరీల మోతలో క్రికెట్ ఫ్యాన్స్ తడిచి ముద్దయ్యారు. టీమిండియా తరుపున బ్యాటింగ్‌కి వచ్చిన కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దినేశ్ కార్తీక్ కూడా తమ మార్క్ చూపించడంతో అభిమానులు ఫుల్లు ఖుష్ అవుతున్నారు...

కెప్టెన్ రోహిత్ శర్మ 37 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేయగా కెఎల్ రాహుల్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 57 పరుగులు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 61 పరుగులు చేసి రనౌట్ కాగా విరాట్ కోహ్లీ 28 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆఖర్లో క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్ 7 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 17 పరుగులు చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు...

19వ ఓవర్ మొదటి బంతికి సూర్యకుమార్ యాదవ్ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత వరుసగా రెండు ఫోర్లు బాదిన విరాట్ కోహ్లీ, 19వ ఓవర్ ముగిసే సమయానికి 28 బంతుల్లో 49 పరుగుల వద్ద నిలిచాడు. ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికి పరుగులేమీ చేయలేకపోయిన దినేశ్ కార్తీక్, ఆ తర్వాత 4,0, 6,6 బాదాడు. కగిసో రబాడా వేసిన ఆఖరి ఓవర్‌లో నాలుగో బంతికి సిక్సర్ బాదిన దినేశ్ కార్తీక్, నాన్‌స్ట్రైయికింగ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ దగ్గరికి వచ్చి... ‘సింగిల్ తీసి స్ట్రైయిక్ ఇవ్వనా, హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంటావా?’ అని అడిగాడు...

దానికి విరాట్ కోహ్లీ... ‘వద్దు, భారీ షాట్‌కి వెళ్లు’ అంటూ సైగలతో సూచించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, మరో పరుగు చేసి ఉంటే ఆ లెక్కను మరింత పెంచుకునేవాడు. అయితే టీమ్‌ కోసం ప్రాధాన్యం ఇచ్చి తన హాఫ్ సెంచరీని త్యాగం చేశాడు విరాట్ కోహ్లీ....

 

ఆసియా కప్ 2022 ఆరంభానికి ముందు టీ20ల్లో విరాట్ కోహ్లీని ఆడించకూడదని చాలా రకాల కామెంట్లు వినిపించాయి. అయితే ఆసియా కప్ 2022 నుంచి గత 10 ఇన్నింగ్స్‌ల్లో 404 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. అది కూడా 141.75 స్ట్రైయిక్ రేటుతో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు సాధించాడు...

అలాగే టీ20ల్లో 11 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు విరాట్ కోహ్లీ. టీమిండియా తరుపున 11 వేల క్లబ్‌లో చేరిన మొట్టమొదటి టీ20 బ్యాటర్ విరాట్ కోహ్లీయే. 304 ఇన్నింగ్స్‌ల్లో 10 వేల పరుగులు అందుకున్న విరాట్ కోహ్లీ, 344 ఇన్నింగ్స్‌ల్లో 11 వేల పరుగులను చేరుకున్నాడు...

మరోవైపు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో 11వ ఓవర్ నడుస్తున్న సమయంలో రోహిత్ శర్మ ముక్కులో నుంచి రక్తం కారింది. అయితే ఓ వైపు కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూనే బౌలర్ హర్షల్ పటేల్‌కి సూచనలు ఇచ్చాడు రోహిత్ శర్మ. ఇబ్బంది పడుతూ పెవిలియన్ చేరిన రోహిత్ శర్మ, కొద్దిసేపటి తర్వాత తిరిగి క్రీజులోకి వచ్చాడు...

Follow Us:
Download App:
  • android
  • ios