విరాట్ కోహ్లీ సెంచరీ కొంపముంచింది !
RCB vs RR : రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో తొలి సెంచరీ కొట్టాడు. దీంతో ఐపీఎల్ లో మొత్తంగా 8వ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ లో 72 బంతులు ఆడి 113* పరుగులు చేశాడు.
RCB vs RR Virat Kohli Century : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17వ సీజన్ 19వ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. అయితే, ఈ మ్యాచ్ లో జోస్ బట్లర్, సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ లో తో బెంగళూరు టీమ్ ను రాయల్స్ మరో 5 బంతులు ఉండగానే ఓడించింది. వరుసగా నాల్గో విజయాన్ని అందుకున్న రాజస్తాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లోకి చేరుకుంది. బెంగళూరు వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయి 8వ ప్లేస్ లో ఉంది.
కొంపముంచి కోహ్లీ.. !
ఈ మ్యాచ్ లో బెంగళూరు తొలుత బ్యాటింగ్ చేసింది. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీతో వన్ మ్యాన్ షో చూపించాడు. దీంతో బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. కానీ, విరాట్ కోహ్లీ సెంచరీ ఆర్సీబీ కొంపముంచింది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి 72 బంతులు ఆడి 113* పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ మాట్లాడుతూ మరో 10-15 పరుగులు చేయాల్సిందని చెప్పుకొచ్చాడు. కానీ పిచ్ స్లోగా ఉండటంతో బెంగళూరు కొట్టిన 183-3 పరుగులను మంచి స్కోర్ గా చెప్పాడు విరాట్.
బీసీసీఐ వార్నింగ్.. మళ్లీ రిపీట్ అయితే రిషబ్ పంత్ పై నిషేధమే.. !
అయితే, విరాట్ చెప్పినట్టుగా పిచ్ స్లోగా ఉన్న సమయంలో కూడా రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టింది. సంజూ శాంసన్, జోస్ బట్లర్ మంచి స్ట్రైక్ రేటుతో పరుగుల వరద పారించారు. మరీ ముఖ్యంగా జోస్ బట్లర్ కేవలం 58 బంతుల్లోనే సెంచరీ కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. వీరిద్దరి స్ట్రైక్ రేటు విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఆర్సీబీ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ చెప్పినట్టుగా మరో 10-15 పరుగులు కొట్టివుంటే మ్యాచ్ బెంగళూరు వైపుకు తిరిగివుండవచ్చు. కానీ ఇక్కడ విరాట్ కోహ్లీ సెంచరీకి చేరువగా వచ్చిన సమయంలో మరింత నెమ్మదిగా ఆడటం స్కోర్ బోర్డుపై ప్రభావం చూపించింది.
ఆ సమయంలో సెంచరీ గురించి లెక్కచేయకుండా విరాట్ దూకుడు కొనసాగించి వుంటే మరో రెండు మూడు సిక్సర్లు వచ్చి వుండేవి. దీంతో ఆర్సీబీకి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉండేవి. అంతకుముందు మ్యాచ్ (కోల్ కతా నైట్ రైడర్స్) లో కూడా విరాట్ మంచి ఇన్నింగ్స్ (59 బంతుల్లో 83 పరుగులు) ఆడినా నెమ్మదించిందనీ, ఇది బెంగళూరును దెబ్బకొట్టిందని ట్రోలర్స్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరోసారి అదే తరహా సెంచరీ ఇన్నింగ్స్.. ఆర్సీబీ ఓడిపోవడంతో మళ్లీ విరాట్ కోహ్లీ ట్రోలర్స్, మీమర్స్ కు టార్గెట్ గా మారాడు.
- BCCI
- Bangalore
- Bangalore vs Rajasthan
- Bangalore vs Rajasthan Royals
- Cricket
- Games
- IPL
- IPL 2024
- Indian Premier League
- Indian Premier League 17th Season
- Jos Buttler
- Jos Buttler Century
- King Kohli
- RCB
- RCB vs RR
- RCB vs RR Highlights
- Rajasthan Royals
- Royal Challengers Bangalore
- Royal Challengers Bangalore vs Rajasthan Royals
- Sanju Samson
- Sports
- Tata IPL
- Tata IPL 2024
- Team India
- Virat
- Virat Kohli
- Virat Kohli Century Innings