ఐపీఎల్ 2019లో భాగంగా గురువారం రాత్రి బెంగళూరు, ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిన షాట్‌‌కి బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ చిరు నవ్వులు చిందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన ముంబై ముందుగా బ్యాటింగ్ చేసింది. రోహిత్ శర్మ, డీకాక్‌లు ఓపెనింగ్‌కు దిగారు. వీరిద్దరూ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా రోహిత్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

ఈ దశలో సిరాజ్ బౌలింగ్‌లో 5వ లాస్ట్ బాల్‌కి రోహిత్ ఔట్ సైడ్ లాంగాన్ దిశగా మంచి కవర్ డ్రైవ్ కొట్టాడు. దీనిని మిడ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తోన్న ఏబీ డివిలియర్స్ అడ్డుకోలేకపోవడంతో బంతి బౌండరీ లైన్‌ను తాకింది. ఈ సమయంలో విరాట్.. రోహిత్ వైపు చూస్తు చిరునవ్వులు చిందించాడు. ఈ వీడియోను ఐపీఎల్ ట్వీట్టర్‌లో పెట్టింది.