కోహ్లీని చూసిన రవూఫ్.. తన దగ్గరకు వచ్చి విరాట్‌ను కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా అతన్ని నవ్వుతూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఆసియాకప్ లో భాగంగా నేడు అంటే శనివారం భారత్, పాక్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం కేవలం ఈ రెండు దేశాల వారు మాత్రమే కాదు, ప్రపంచంలోని క్రికెట్ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో అందరి కళ్లు టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ పైనే ఉన్నాయి. ఎందుకంటే పాక్ తో మ్యాచ్ అంటే కోహ్లీని ఆపడం ఎవరితరమూ కాదు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో పాక్‌పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. ఆ మ్యాచ్‌లో పాక్ స్టార్ పేసర్ హారిస్ రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ బాదిన భారీ సిక్సర్ ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ వీరు తలపడేది ఈరోజే. ఈ నేపథ్యంలో మరింత ఆసక్తి నెలకొంది.
అయితే, సిరీస్ నేపథ్యంలో ఈ రెండు జట్లు ప్రాక్టీస్ మ్యాచ్ కి వచ్చాయి. ఆ సమయంలో కోహ్లీకి హారిస్ రవూఫ్ ఎదురయ్యాడు. కోహ్లీని చూసిన రవూఫ్.. తన దగ్గరకు వచ్చి విరాట్‌ను కౌగిలించుకున్నాడు. కోహ్లీ కూడా అతన్ని నవ్వుతూ పలకరించాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
మరి కాసేపట్లో వీరిద్దరూ తలపడాల్సి ఉండగా, ఇంత ప్రేమగా పలకరించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. 2022 T20 ప్రపంచ కప్‌లో రవూఫ్ బౌలింగ్‌లో కోహ్లీ చిరస్మరణీయ సిక్సర్ కొట్టిన తర్వాత వీరిద్దరికి ఇది మొదటి సమావేశం కావడం విశేషం.
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆసియా కప్ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ ఎలాంటి మార్పు లేకుండా ప్లేయింగ్ ఎలెవన్‌ను బరిలోకి దించనుంది.
బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో నేపాల్‌ను 238 పరుగుల తేడాతో చిత్తు చేసిన పాకిస్థాన్ జట్టు పేరును ఖరారు చేసింది.
కెప్టెన్ బాబర్ ఆజం (151), ఇఫ్తికార్ అహ్మద్ (109 నాటౌట్) రాణించడంతో పాకిస్థాన్ 6 వికెట్ల నష్టానికి 342 పరుగులు చేసింది. షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టడంతో నేపాల్ 104 పరుగులకే ఆలౌటైంది.
మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో, పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం భారత్‌తో జరిగే ప్లేయింగ్ ఎలెవన్‌ను పిసిబి వెల్లడిస్తుందని తెలియజేశాడు. తాను, ఇమామ్-ఉల్-హక్ , ఫఖర్ జమాన్‌లకు మద్దతు ఇవ్వడానికి మిడిల్ ఆర్డర్ నుండి కొంచెం ఎక్కువ సహకారం ఉంటుందని బాబర్ ఆశించాడు.
"ఇటీవలి కాలంలో టాప్ ఆర్డర్ బాగా దోహదపడుతోంది. మిడిల్ ఆర్డర్‌లో ఉన్న కుర్రాళ్ళు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు మరియు వారు భారత్‌పై దీన్ని చేయగలరని ఆశిస్తున్నాను" అని అతను చెప్పాడు.
పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్: బాబర్ ఆజం (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా, ఇఫ్తీకర్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ నవాజ్, నసీమ్ షా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్.
