టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ జంటకు క్రేజ్ ఎక్కువ. విడివిడిగా ఇద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నా... వీరిద్దరినీ జంటగా చూడటానికి అభిమానులు ఇష్టపడతారు. ఈ క్యూట్ కపుల్ తాజాగా సోషల్ మీడియాలో ఓ రొమాంటిక్ పిక్ ని షేర్ చేశారు. కాగా... ఆ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విరాట్ ఆ పిక్ ని పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే అది వైరల్ గా మారడం గమనార్హం. ఈ ఫోటోలు ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు. డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్ గా ఉంది. వారి ఫోటో వెనుక ఉన్న లోకేషన్ ఇంకా అందంగా ఉంది. అనుష్క బ్యాక్ కలర్ డ్రస్ వేసుకోగా... కోహ్లీ గ్రే కలర్ షర్ట్, బ్లాక్ కలర్ షార్ట్ వేసుకున్నాడు. ఈ ఫోటోని హాట్ సింబల్ క్యాప్షన్ తో కోహ్లీ షేర్ చేశారు. కాగా... ఈ ఫోటోకి కొన్ని గంటల్లోనే  రెండు మిలియన్లకు పైగా లైక్స్ రావడం విశేషం.

AlsoRead  నీ నెంబర్ డిలీట్ చేయాలా..? బంగ్లా క్రికెటర్ పై బీసీబీ చీఫ్ ఫైర్

వీళ్లు ఎప్పుడు సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసినా.. కొన్ని గంటల్లోనే మిలియన్ల లైక్ లు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోటో కూడా అదే రేంజ్ లో నెట్టింట వైరల్ గా మారింది. కాగా... మొన్నటి వరకు దక్షిణాఫ్రికాతో వరస సిరీస్ లతో తీరిక లేకుండా గడిపిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం కాస్త విశ్రాంతి  లభిచింది.

త్వరలో బంగ్లాదేశ్ తో వరస సిరీస్ లు జరగనుండగా...టీ 20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కి మాత్రం కోహ్లీకి మనిహాయింపు ఇచ్చారు. ఈ సిరీస్ కి కోహ్లీ కి విశ్రాంతి ఇచ్చి.. కెప్టెన్ గా రోహిత్ శర్మను నియమించారు. మళ్లీ టెస్టు సిరీస్ కి కోహ్లీ జట్టుతో కలుస్తాడు. 

AlsoRead పెద్ద పనికి చిన్న సాయం...కూతురితో కలిసి కారు క్లీన్ చేసిన ధోనీ

ఇదిలా ఉండగా.. అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ... కొన్ని సంవత్సరాలపాటు ప్రేమించుకొని 2017 డిసెంబర్ లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి ఇద్దరూ తమ కెరీర్ లో దూసుకుపోతూనే.. తమకంటూ సమయాన్ని కేటాయిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

😍❤️ @anushkasharma

A post shared by Virat Kohli (@virat.kohli) on Oct 24, 2019 at 10:40pm PDT