టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి కార్లు , బైక్ లు అంటే మహా పిచ్చి. ఈ విషయం ఆయన అభిమానులు అందరికీ తెలిసు. ఇటీవలే ఆయన మరో కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేశారు. తన కార్ల లిస్టులో ‘నిసాన్‌ జొంగా’ జీప్‌ను కూడా చేర్చేశాడు. 

ధోనీ కొత్త కారు ఫోటోలు కూడా ఇటీవల నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే... తాజాగా... ఆ నూతన వాహానాన్ని ధోనీ స్వయంగా తాను శుభ్రం చేశాడు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన తన కారును శుభ్రం చేసుకున్నారు. అయితే... ధోనీతోపాటు.. ఆయన గారాల పట్టి జీవా కూడా చేరింది. తండ్రీ, కూతుళ్లు ఇద్దరూ కలిసి మరీ కారును శుభ్రం చేశారు. 

ఇందులో ప్యాంట్‌ను పైకి మడుచుకుని.. చేతిలో వాషింగ్‌ క్లాత్‌తో ఉన్న ధోని, జీవాలను  చూస్తుంటే వారిద్దరు పనిలో చాలా బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘పెద్ద పనికి.. చిన్న సాయం ఎప్పటికీ ప్రత్యేకంగానే ఉంటుంది’ అనే టైటిల్‌తో ధోనీ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో  షేర్ చేయగా.. వైరల్ అయ్యింది.

ఈ వీడియోకి.. గంటలోనే దాదాపు 7 లక్షల వ్యూస్‌ రాగా వేలల్లో కామెంట్స్‌ వచ్చాయి. ‘మేము కూడా మీకు సాయం చేస్తాం ప్లీజ్‌ అంటూ కొందరు కామెంట్స్ చేయగా... ధోనీ చాలా సింపుల్  కొందరు కొనియాడుతుండటం విశేషం. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A little help always goes a long way specially when u realise it’s a big vehicle

A post shared by M S Dhoni (@mahi7781) on Oct 24, 2019 at 3:02am PDT