Asianet News TeluguAsianet News Telugu

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 నుంచి విరాట్ కోహ్లీ ఔట్.. బీసీసీఐ షాకింగ్ డెసిషన్ !

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024లో గ్రూప్-ఏ లో పాకిస్థాన్, ఐర్లాండ్, అమెరికా, కెనడాలతో పాటు భారత్ ఉంది. జూన్ 5న ఐర్లాండ్ తో మెన్ ఇన్ బ్లూ త‌న తొలి మ్యాచ్ ఆడ‌నుంది. అయితే, కింగ్ కోహ్లీ విష‌యంలో బీసీసీఐ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని సంబంధిత వ‌ర్గాట్లో టాక్ న‌డుస్తోంది. 
 

Virat Kohli ruled out of T20 World Cup 2024 BCCI's Shocking Decision On Team India reports RMA
Author
First Published Mar 12, 2024, 2:16 PM IST

Team India: విరాట్ కోహ్లీకి సంబంధించి క్రికెట్ వ‌ర్గాల‌తో పాటు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ న‌డుస్తోంది. రానున్న టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం భార‌త జ‌ట్టులో విరాట్ కోహ్లీకి స్థానం క‌ల్పించ‌డం లేద‌ని క్రికెట్ వ‌ర్గాల్లో టాక్ న‌డుస్తోంది. దీంతో అభిమానుల నుంచి అగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ సారి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌, అమెరికాలో జరగనుంది. తాజాగా మీడియా రిపోర్టుల ప్రకారం వెస్టిండీస్ స్లో పిచ్ విరాట్ కోహ్లీకి సరిపోవ‌డం లేద‌నీ, దీంతో టీ20 ప్రపంచకప్‌ నుంచి కోహ్లీని తప్పించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

అంతేకాదు యంగ్  ప్లేయ‌ర్లకు అవకాశం కల్పించేలా విరాట్ కోహ్లీని ఒప్పించే బాధ్యతను భారత క్రికెట్ జట్టు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు అప్పగించినట్లు సమాచారం. టీ20 అవసరాలకు అనుగుణంగా తన ఆటను మార్చుకోవడంపై చీఫ్ సెలక్టర్ కోహ్లీతో చర్చలు జరిపారు. అయితే అఫ్గానిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లో కోహ్లి దూకుడు ప్రదర్శించలేకపోయాడు. అయితే, ఈ విష‌యంలో అధికారి ప్ర‌క‌ట‌న రాలేదు. బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ ప్ర‌పంచ క‌ప్ జ‌ట్టు లో ఉంటారా?  లేదా? అనేది విష‌యాలు మాట్లాడ‌లేదు.

IPL 2024: రిషబ్ పంత్ పై రికీ పాంటింగ్ కామెంట్స్ వైర‌ల్

2024 టీ20 ప్రపంచకప్‌ను రోహిత్ శర్మ నేతృత్వంలోనే టీమ్ ఇండియా ఆడుతుందని ఇదివ‌ర‌కు జే షా ధృవీకరించారు. దీంతో రోహిత్ శ‌ర్మ‌కు స్థానం ఖాయం కాగా, సరైన సమయంలో కోహ్లీపై నిర్ణయం తీసుకుంటామని మాత్రమే జైషా చెప్పారు. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌లోకి ప్రవేశించేందుకు కోహ్లీకి ఉన్న ఏకైక మార్గం ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్. ఐపీఎల్ 2024లో కోహ్లి బాగా రాణిస్తే టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. టీ20 ప్ర‌పంచ క‌ప్ కావ‌డంతో సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్, తిలక్ వర్మ, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు జట్టుకు బాగా సరిపోతారని నివేదిక పేర్కొంది.

IPL 2024: ధోని టీమ్ టిక్కెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే.. ! ఐపీఎల్ టిక్కెట్ల బుకింగ్, ధ‌ర ఎంతో తెలుసా?

Follow Us:
Download App:
  • android
  • ios