టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు వినపడగానే.... క్రికెట్ మాత్రమే కాదు... అతని ఫిట్ నెస్ కూడా అందరికీ గుర్తు వస్తూ ఉంటుంది. చాలా స్ట్రిక్ట్ గా డైట్ ఫాలోఅవుతుంటారు. చాలా మంది సెలబ్రీటీలు కనీసం వారానికి ఒకసారి చీట్ డే పేరిట నచ్చినవి తింటూ ఉంటారు.. కానీ కోహ్లీ మాత్రం దానికి కూడా ఛాన్స్ ఇవ్వడు. అలాంటి కోహ్లీ... ఒక రోజు మాత్రం డైట్ పక్కన పెట్టి తనకు నచ్చిన ఫుడ్ మొత్తం తినేశాడట. ఈ విషయాన్ని తాజాగా కోహ్లీనే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

2016లో ఇంగ్లాండ్ తో టీమిండియా తలపడిన సంగతి గుర్తుండే ఉంటుంది. అప్పుడు విరాట్ కోహ్లీ బీభత్సం సృష్టించాడు. దాదాపు 235 పరుగులు చేశాడు. జయంత్ యాదవ్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ మ్యాచ్ తర్వాత... విరాట్ కి అతని ఫిట్నెస్ ట్రైనర్ బంపర్ ఆఫర్ ఇచ్చాడట. ఆ ఒక్కరోజు ఏది కావాలంటే అది తినమని చెప్పాడట.

అంతే... విరాట్ ఆ రోజు సాయంత్రం.. చికెన్ బర్గర్, చాక్లెట్ కేకు లాగించేశాడట. ఓ ఇంటర్వ్యూలో విరాట్ మాట్లాడుతూ..‘ నేను ఆ రోజు 235పరుగులు  చేశాను. గేమ్ రోజు నేను ఎక్కువగా తినను. దాదాపు అరటి పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకుంటాను. కానీ ఆరోజు మాత్రం మా ఫిటెనెస్ ట్రైనర్ శంకర్ బసు నాకు అనుమతి ఇచ్చాడు. దీంతో... చెకెన్ బర్గర్ ఆర్డర్ చేసుకొని తినేశాను. ఆ తర్వాత ఓ పెద్ద ప్లేటు ఫ్రెంచ్ ప్రైస్, చాక్లెట్ షేక్ తీసకున్నాను. ’ అని చెప్పాడు. ఇప్పుడు మాత్రం తాను కనీసం చీట్ డే కూడా ఫాలో అవ్వనని.. తన బాడీ కి కవాల్సిన ఆహారాన్ని అందిస్తానని చెబుతున్నాడు. 

ఇక విరాట్ కోహ్లీ... ఫిట్ నెస్ విషయంలో మాత్రం ఎలాంటి అశ్రద్ధ చూపించడు.తన ఫిట్ నెస్ కి సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.