టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ కారణంగానే తన పేరు ఫేమస్ అయ్యిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. ధోనీ కారణంగా కో హ్లీ ఫేమస్ కావడం ఏంటా అనుకుంటున్నారా..? మీరు చదివింది నిజమే.. ఈ విషయాన్ని కోహ్లీనే చెప్పాడు.

Also Read కరోనా లాక్ డౌన్... ఆగిన మహిళా క్రికెటర్ పెళ్లి...

ఇంతకీ మ్యాటరేంటంటే..  ప్రస్తుతం కరోనా కారణంగా దేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. ఇంట్లో ఖాళీగా సమయం గడుపుతున్న క్రికెటర్లను ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు.

ఈ ఇంటర్వ్యూలో కోహ్లీ ఓ ఆసక్తికర విషయం వెల్లడించాడు. కోహ్లీకి చికు అనే ముద్దు పేరు ఉంది. ఈ విషయం ఆయన అభిమానులకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. రంజీ ట్రోఫీ ఆడే సమయంలో కోహ్లీకి అతని కోచ్ ఆ పేరు పెట్టాడు.

చిన్నప్పుడు తనకు బాగా బుగ్గలు ఎక్కువగా ఉండేవని.. అందుకే చంపక్ అనే ఓ కార్టూన్ పేరుని తనకు చీకు అని పెట్టాడని కోహ్లీ వివరించాడు. ఆ పేరు చాలా కొద్ది మందికే తెలుసని.. కానీ ధోనీ కారణంగానే ఆ పేరు అందరికీ తెలిసిందని చెప్పాడు. ఓ రోజు వికెట్ వెనకాల ఉన్న సమయంలో తనను ధోనీ చికు అని పిలిచాడని.. అలా తన పేరు అందరికీ తెలిసి ఫేమస్ అయ్యిందని కోహ్లీ వివరించాడు.