Asianet News TeluguAsianet News Telugu

Virat Kohli: దక్షిణాఫ్రికాకు చేరుకున్న విరాట్ కోహ్లీ.. సడెన్‌గా మూడు రోజులు ఎక్కడికి వెళ్లాడంటే..

IND vs SA: భారత్,దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభానికి కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాపై టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుని గత రికార్డులను బ్రేక్ చేయాలని రోహిత్ సేన పట్టుదలతో టెస్ట్ సమరానికి సిద్దమవుతోంది. దీనికి ముందు టీమ్ ఇండియాలో అలజడి నెలకొంది. 

Virat Kohli Rejoins India Squad In South Africa krj
Author
First Published Dec 24, 2023, 5:11 PM IST

IND vs SA : దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ని 1-1 తో సమం చేసింది.  అనంతరం ఆడిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో దక్షిణాఫ్రికాపై అధిపత్యం చేలాయించి.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడూ రోహిత్ శర్మ కెప్టెన్సీలో లో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడేందుకు టీమిండియా సిద్దమైంది. సెంచూరియన్‌లోని చారిత్రాత్మక సూపర్ ‌స్పోర్ట్ పార్క్ వేదికగా జరుగనున్న భారత్-దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్‌ లోని తొలి మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా సఫారీ జట్టుపై విజయం సాధించి.. సుదీర్ఘ నిరీక్షణకు తెర దించాలనీ, సరికొత్త చరిత్ర సృష్టించాలని భారత జట్టు భావిస్తోంది. 

అయితే ఈ సిరీస్‌కు ముందు భారత జట్టులో అలజడి నెలకొంది. రుతురాజ్ గైక్వాడ్, మహమ్మద్ షమీ, ఇషాన్ కిషన్ వంటి ఆటగాళ్లు సిరీస్‌కు దూరమయ్యారు. అదే సమయంలో ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్ కోహ్లి కూడా జట్టుకు దూరమయ్యారు. కోహ్లీ సౌతాఫ్రికా నుంచి లండన్ వెళ్లిపోయాడు. దీంతో కోహ్లీ జట్లులోకి తిరిగి రావడంపై సందేహం నెలకొంది. అయితే.. తాజాగా జట్టుకు దూరమైన విరాట్ కోహ్లీ తొలి టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు తిరిగి దక్షిణాఫ్రికాకు చేరుకున్నాడు. లండన్‌ నుంచి వచ్చిన కోహ్లీ ప్రాక్టీస్‌ మ్యాచుల్లో మాత్రం పాల్గొనడని, నెట్స్‌లోనే సాధన చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.

విరాట్ కోహ్లీ మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే ఇప్పుడు అది ప్లాన్డ్ ట్రిప్ అని తన లండన్ ట్రిప్ గురించి వెల్లడించినట్లు బిసిసిఐ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్ లండన్ వెళ్లలేదని తెలిపారు. విరాట్ కోహ్లీ ప్రాక్టీస్‌ మ్యాచుల్లో ఆడటం లేదు. అతని పర్యటన గురించి టీమ్ మేనేజ్‌మెంట్‌కు తెలుసు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు విరాట్ కోహ్లీ ప్రణాళికలు, షెడ్యూల్‌పై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. అతడు ప్రతి విషయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు.

అప్పటికప్పుడు అనుకుని అతడు లండన్‌కు వెళ్లలేదు. విరాట్ కోహ్లీ లండన్‌ ట్రిప్‌ కూడా ప్లాన్‌ ప్రకారమే జరిగిందని తెలిపారు. 'డిసెంబర్ 15న కోహ్లీ భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లాడు. డిసెంబర్ 19న లండన్‌కు బయలుదేరే ముందు, అతను 3-4 ప్రాక్టీస్ సెషన్‌ల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు లండన్‌లో ఉన్న అతను ఇప్పుడు టెస్ట్ టీమ్‌లో చేరాడు. అన్నింటిలో పాల్గొంటాడు. రేపు సెంచూరియన్‌లో శిక్షణ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అనుష్క శర్మ మరోసారి తల్లికాబోతుండటంతో కోహ్లీ లండన్‌కు వెళ్లి వచ్చినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. టెస్టు క్రికెట్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాను భారత జట్టు ఇప్పటివరకూ ఓడించలేకపోయింది. డిసెంబర్ 26న జరిగే తొలి టెస్టులో ఇరు జట్లు తలపడనున్నాయి. మరి ఈసారి చరిత్ర సృష్టించడంలో రోహిత్ అండ్ టీం సక్సెస్ అవుతుందా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios