విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!
ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అని తెలుస్తోంది. కాగా, కోహ్లీ సెంచరీకి ముందే పలు రికార్డులను బద్దలు కొట్టాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి రికార్డులు కొత్తేమీ కాదు. ఆయన మైదానంలోకి అడుగుపెడితే పరుగుల వరద పారిస్తూ ఉంటాడు. అంతేకాదు. ఆయన ఇప్పటి వరకు చాలా రికార్డులు సాధించాడు. ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ రెండో టెస్టు కోసం తలపడుతున్న విషయం తెలిసిందే. కాగా , ఈ రెండో టెస్టు మ్యాచ్ కోహ్లీకి 500వ అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం.
ఈ మ్యాచ్ లో కోహ్లీ మరింత అదరగొట్టాడు. అభిమానులను ఉత్సాహపరుస్తూ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ సెంచరీకి కేవలం 13 పరుగుల దూరంలో ఉండటం విశేషం. ప్రస్తుతం కోహ్లీ 87 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ క్రమంలో కోహ్లీ సెంచరీ చేయడం ఖాయం అని తెలుస్తోంది. కాగా, కోహ్లీ సెంచరీకి ముందే పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
టెస్టు క్రికెట్ లో నెంబర్ 4లో బ్యాటింగ్ కు వచ్చి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో కోహ్లీ ఐదో స్థానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ 7097 పరుగులతో ఉన్నాడు. ఇక ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ 13492 పరుగులతో తొలి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక క్రికెటర్ మహేల జయవర్దనే 9509 పరుగులతో రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్ కలిస్ 9033 పరుగులతో మూడో స్థానంలో, విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా 7753 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక వీరి తర్వాత కోహ్లీ ఐదో స్థానంలో నిలిచారు.
ఇక, అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లీ ఐదో స్థానంలో ఉండటం విశేషం. 500వ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ అన్ని ఫార్మాట్లు కలిపి 25548 పరుగులు సాధించాడు. ఇందులో 75 సెంచరీలు, 131 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.