శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 45 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లీ.. ఫీల్డింగ్ సమయంలో బౌలర్లను ఉత్సాహపరుస్తూ సరదాగా కనిపించాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ట్రెండ్ ఫాలో అయ్యాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా లోని తగ్గేదెలే డైలాగ్ చెప్పడం గమనార్హం. పుష్ప సినిమా తెలుగుతో పాటు.. ఇతర భాషల్లోనూ విడుదలై.. హిట్ టాక్ తో దూసుకుపోయింది. ఈ సినిమాలోని శ్రీవల్లి పాట.. అల్లు అర్జున్ తగ్గేదెలే డైలాగ్.. ఎక్కువ పాపులర్ అయ్యాయి. వీటిని చాలా మంది రీల్స్ రూపంలో చేశారు. టీమిండియా క్రికెటర్లు సైతం ఈ ట్రెండ్ మీద రీల్స్ చేశారు. కాగా.. తాజాగా కోహ్లీ కూడా ఇదే చేయడం గమనార్హం.
శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో 45 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లీ.. ఫీల్డింగ్ సమయంలో బౌలర్లను ఉత్సాహపరుస్తూ సరదాగా కనిపించాడు.
ఈ క్రమంలోనే జడేజా బౌలింగ్ చేస్తున్నప్పుడు ‘తగ్గేదేలే’ మ్యానరిజంతో జడ్డూను ఎంకరేజ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మొహాలీ వేదికగా జరిగిన ఈ టెస్టు కోహ్లీకి 100వ టెస్టు. కెప్టెన్‌గా రోహిత్ శర్మకు మొదటిది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టును వరుసగా రెండు సార్లు ఆలౌట్ చేసిన భారత బౌలర్లు.. టీమిండియాకు ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని కట్టబెట్టారు.
